AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎనుముల రేవంత్ రెడ్డి

ఎనుముల రేవంత్ రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్‌గా ఎనుముల రేవంత్ రెడ్డి గుర్తింపు సాధించారు. దూకుడు ఆయనకు ప్లస్.. ఓ రకంగా మైనస్ కూడా అదే. తెలంగాణ రాష్ట్రానికి ఆయన రెండో ముఖ్యమంత్రి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అంతకు ముందు తెలంగాణ పీసీసీ చీఫ్‌‌గా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.

2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మల్కాజిగిరి నియోజకవర్గ లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ఆయన.. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009-2014 వరకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2004-2018 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహించారు.

రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిలో జన్మించారు. బీఏ వరకు చదువుకున్న రేవంత్ రెడ్డి.. ధివంగత కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు గీతా రెడ్డిని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె నైమిషా రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డికి మొత్తం ఏడుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు.

విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన రేవంత్ రెడ్డి.. 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. తెలంగాణ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇంకా చదవండి

రేపే మెస్సీ Vs సీఎం రేవంత్ ఫుట్​బాల్ మ్యాచ్

రేపు ఉప్పల్ స్టేడియంలో మెస్సీ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ మ్యాచ్ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. రాచకొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ప్రైవేట్ కార్యక్రమం ఫుట్‌బాల్‌ను ప్రోత్సహించి, హైదరాబాద్‌ను క్రీడా హబ్‌గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మెస్సీతో మీట్ అండ్ గ్రీట్ సెషన్ కూడా ఉంది.

  • Phani CH
  • Updated on: Dec 12, 2025
  • 7:20 pm

CM Revanth Reddy: ఢిల్లీలో NCP అధినేత శరద్ పవార్ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్ తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటను వెళ్లారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విందుకు హాజరయ్యారు. గురువారం శరద్‌ పవార్ 85 వసంతాలను పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా రేవంత్ రెడ్డి ఆయనకు ముందుగానే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

CM Revanth Reddy: కులం అనే అడ్డుగోడలను తొలగించేందుకే యంగ్ ఇండియా స్కూల్స్

సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రసంగిస్తూ, కుల వివక్ష, సామాజిక వెనుకబాటుతనం నిర్మూలనకు విద్యే కీలకమని ఉద్ఘాటించారు. భూములు ఉన్నా చదువు లేకపోతే వెనుకబాటుతనం ఉంటుందని ఒక సర్వే వెల్లడించిందని ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన విద్య, సాంకేతిక నైపుణ్యాల ద్వారానే విద్యార్థులు సమాజంలో గుర్తింపు, గౌరవాన్ని పొందుతారని సీఎం స్పష్టం చేశారు.

  • Phani CH
  • Updated on: Dec 10, 2025
  • 5:31 pm

Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. 100ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్.. 8వేల ఉద్యోగాలు..

తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యానికి మద్దతుగా సుమధుర గ్రూప్ రూ.600 కోట్లతో భారీ పెట్టుబడి ప్రకటించింది. 100 ఎకరాల్లో అత్యాధునిక పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తుంది. ఇది ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఫార్మా రంగాలకు ప్లగ్-అండ్-ప్లే సౌకర్యాలను అందించి.. 8 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది.

Revanth Reddy: ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఉస్మానియాకు సీఎం రేవంత్ రెడ్డి.. రూ.1000 కోట్లతో ‘సర్వం సిద్ధం’..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టులో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ (OU) లో పర్యటిస్తున్నారు. వర్సిటీలో సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కోసం.. ఇప్పటికే రూ.1000కోట్లు ప్రకటించారు. ఇవాళ నిధులకు సంబంధించిన జీవో కూడా విడుదల చేశారు. విద్యార్థులు, అధ్యాపకుల సూచనలతో అభివృద్ధికి DPR రెడీ చేశారు.

Salman Khan: తెలంగాణలో సల్మాన్ ఖాన్ రూ.10 వేల కోట్ల పెట్టుబడి.. ఫిల్మ్ స్టూడియో అభివృద్ధికి ముందడుగు..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా సల్మన్ కు సంబంధించిన వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దాదాపు పదివేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్యింది.

Hyderabad: ఇది కదా కావాల్సింది.. 2047 నాటికి బ్లూ అండ్ గ్రీన్ సిటీగా హైదరాబాద్..

2047 నాటికి బ్లూ అండ్ గ్రీన్ సిటీగా హైదరాబాద్‌ను మార్చేలా విజన్ రూపొందించింది ప్రభుత్వం. నగరంలో కాలుష్య రహిత రహదారులు, హుస్సేన్ సాగర్ 2.0, సైక్లింగ్ అండ్ వాకింగ్ లూప్స్, ఎలాంటి అంతరాయం లేని రవాణా సౌకర్యం లాంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి.

Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‏లో సినీప్రముఖుల సందడి..

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ సమ్మిట్ రెండో రోజు మంగళవారం కీలక ఘట్టాలకు వేదిక అయ్యింది. సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ ను అధికారికంగా విడుదల చేశారు. ఈ పత్రంలో వచ్చే రెండున్నర దశాబ్దాలపాటు రాష్ట్ర అభివృధ్ది దిశ, లక్ష్యాలు, వృద్ధి వ్యూహాలు వివరంగా ఉండనున్నాయి.

CM Revanth Reddy: స్క్రిప్ట్‏తో వస్తే చాలు సినిమా పూర్తి చేసుకొని వెళ్లొచ్చు.. సీఎం రేవంత్ రెడ్డి..

సినిమా అంటే రంగుల ప్రపంచమే కాదు. రాష్ట్ర అభివృద్ధిలో అదీ ఓ భాగం. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2025లో.. ఈ ముచ్చట ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనే చెప్పాలి. సమ్మిట్‌లో ఎన్నో రంగాల నిపుణులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం... సినీ పరిశ్రమకు కూడా రెడ్‌ కార్పెట్‌ వేసింది. 2047విజన్‌ డాక్యుమెంట్‌ని జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి... సినిమా రంగ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

Allu Aravind : మన కల్చర్ ప్రపంచానికి పరిచయం చేయాలి.. ఇక్కడి కథలు ప్రపంచవేదికపై ఉండాలి.. అల్లు అరవింద్..

సినిమా రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తోందని అన్నారు నిర్మాత అల్లు అరవింద్. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో టాలీవుడ్, బాలీవుడ్ సినీప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ తోపాటు నిర్మాత సురేష్ బాబు సైతం పాల్గొన్నారు.

Telangana: మూడు సెషన్స్‌, ఆరు పెట్టుబడులుగా గ్లోబల్‌ సమ్మిట్‌

మూడు సెషన్స్‌, ఆరు పెట్టుబడులన్నట్లు సూపర్‌డూపర్‌ సక్సెస్‌ అయ్యింది తెలంగాణ రైజింగ్‌-2025 గ్లోబల్‌ సమ్మిట్‌. ప్రతినిధుల అభిప్రాయాలు, సూచనలతో ఫలప్రదంగా ముగిశాయి రెండోరోజు సెషన్స్‌. ఉదయం 10గంటలనుంచే మొదలైన ప్యానల్‌ డిస్కషన్స్‌లో అన్ని అంశాలను కూలంకషంగా చర్చించడంతో విలువైన సూచనలొచ్చాయి. ..

CM Revanth Reddy: తెలంగాణ విజన్ డాక్యుమెంట్ విడుదల చేసిన సీఎం రేవంత్.. 10 కీలక అంశాలు

తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 83 పేజీలతో కూడిన ఈ డాక్యుమెంట్‌ను తెలంగాణ మీన్స్ బిజినెన్ పేరుతో రిలీజ్ చేశారు. 10 కీలక అంశాలతో ఉన్న ఈ డాక్యుమెంట్‌లో మహిళలు, రైతులు. యువతకు ప్రాధాన్యత కల్పించారు.