రామ్ చరణ్
మెగస్టార్ చిరంజీవి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా మెగా పవర్ స్టార్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుసగా హిట్లు కొడుతూ ఏకంగా గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయాడు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ రేంజ్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లిపోయింది. ప్రస్తుతం మన దేశంలో అత్యధిక పారితోషకం తీసుకునే నటుల్లో చెర్రీ కూడా ఒకరు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగానూ, బిజినెస్ మెన్‌గానూ సత్తా చాటుతున్నాడు రామ్ చరణ్. 2007లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమాలో వెండితెరకు పరిచయమయ్యాడీ మెగా పవర్ స్టార్. దుమ్మురేపే డ్యాన్స్‌లు, ఫైట్లతో మొదటి చిత్రంతోనే ఉత్తమ డెబ్యూ నటుడిగా ఫిల్మ్‌పేర్ పురస్కారం అందుకున్నాడు. ఇక రెండో చిత్రం మగధీరతో సంచలనమే సృష్టించాడు. ఈ సినిమాతో అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నీ కొల్లగొట్టాడీ గ్లోబల్ స్టార్. అంతేకాదు ఇదే సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా మరో ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు. రచ్చతో మాస్ ప్రేక్షకుల అభిమానం చూరగొన్నాడు. ఎవడు, నాయక్, ధ్రువ.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం రామ్ చరణ్‌లోని నటనా ప్రతిభకు తార్కణంగా నిలిచింది. ఇందులో బుచ్చిబాబుగా చెర్రీ అభినయ విమర్శకులను సైతం మెప్పించింది. ఇదే సినిమాకు ఉత్తమ నటుడిగా మరోసారి ఫిల్మ్ పేర్ పురస్కారం అందుకున్నాడు రామ్ చరణ్. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌తో మరోసారి ఇండస్ట్రీ రికార్డులను దున్నేశాడు. సీతారామరాజు పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన మెగా పవర్ స్టార్ తన నటనతో అంతర్జాతీయ అవార్డులు అందుకున్నాడు. ఇక నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌ను స్థాపించి హిట్ సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇక రామ్ చరణ్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 2012లో ఉపాసన కామినేనితో పెళ్లిపీటలెక్కారు. 2023లో ఈ దంపతులకు క్లింకార కొణిదెల అనే కూతురు జన్మించింది.
Ram Charan: ‘పెద్ది’ సినిమా వాయిదా పడనుందా? స్వయంగా అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్.. వీడియో ఇదిగో
గత కొన్ని రోజులుగా పెద్ది సినిమా విడుదల తేదీపై సందిగ్ధం కొనసాగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 30న రిలీజ్ అవుతుందా? లేదా మళ్లీ వాయిదా పడనుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- Basha Shek
- Updated on: Apr 1, 2026
- 9:07 pm
Peddi: అందర్నీ కార్నర్ చేస్తున్న రామ్ చరణ్
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా టాలీవుడ్ రిలీజ్ డేట్లను తారుమారు చేస్తోంది. ఏప్రిల్ 30న 'పెద్ది' విడుదల అవుతుండటంతో, ఇతర నిర్మాతలు తమ చిత్రాలను వాయిదా వేసుకుంటున్నారు. అఖిల్ 'లెనిన్' మే 1 నుండి జూన్ 26కి వాయిదా పడగా, తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం' పరిస్థితి కూడా డైలమాలో ఉంది. ఒక్క 'పెద్ది' ప్రభావంతో అనేక సినిమాలు తమ విడుదల తేదీలను మార్చుకోవాల్సి వస్తోంది.
- Lakshminarayana Varanasi
- Updated on: Mar 31, 2026
- 5:10 pm
అప్పుడు రామ్ చరణ్ క్లాస్ మేట్.. కట్ చేస్తే సినిమాలో తల్లిగా.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. పెద్ది సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాలో అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు
- Rajeev Rayala
- Updated on: Mar 31, 2026
- 11:20 am
Peddi: పెద్ది మరోసారి వాయిదా పడనుందా..? టెన్షన్‌లో చిన్న సినిమాలు
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబోలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ హైప్ నెలకొంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వ్సతున్న ఈ చిత్రం పై దేశవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
- Rajeev Rayala
- Updated on: Mar 31, 2026
- 8:03 am
అరెరే..!! రంగమత్త పాత్ర ఎలా మిస్ చేసుకుంది.. ఆ స్టార్ హీరోయిన్ నో చెప్పడంతో అనసూయకు ఛాన్స్
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘చిట్టిబాబు’గా ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒక స్టార్ హీరోలో దాగి ఉన్న అద్భుతమైన నటుడిని బయటకు తీసి, తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు సుకుమార్. ఈ సినిమా టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది.
- Rajeev Rayala
- Updated on: Mar 30, 2026
- 11:34 am
Peddi Movie : పెద్ది కోసం అక్కినేని హీరో సినిమా వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. డైరెక్టర్ బుచ్చిబాబు సన, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాను ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా పెద్ది కోసం అక్కినేని హీరో సినిమా వాయిదా పడింది.
- Rajitha Chanti
- Updated on: Mar 29, 2026
- 8:19 am
Ram Charan : రామ్ చరణ్ పుట్టినరోజు.. ఇంట్లోనే ప్రత్యేక హోమం చేయించిన చిరంజీవి దంపతులు.. వీడియో చూశారా.. ?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు నేడు (మార్చి 27). ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, దర్శక నిర్మాతలు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. మరోవైపు చరణ్ బర్త్ డేను అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే చరణ్ చిన్ననాటి ఫోటోస్ షేర్ చేసుకుంటూ తండ్రిగా గర్వంగా ఉందని ట్వీట్ చేశారు.
- Rajitha Chanti
- Updated on: Mar 27, 2026
- 7:15 pm
Ram Charan : ఒక్క మాట అడగ్గానే రామ్ చరణ్ రూ.40 లక్షలు ఇచ్చారు.. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కామెంట్స్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. చిరు నట వారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఈరోజు (మార్చి 27) చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు, దర్శక నిర్మాతలు విషెస్ తెలుపుతున్నారు.
- Rajitha Chanti
- Updated on: Mar 27, 2026
- 4:55 pm
Peddi Movie : చికిరి చికిరి సాంగ్‌లో కనిపించిన ఈ చిన్నది బయట ఎలా ఉందో చూశారా.?
ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నారు మెగా పవర్ స్టార్ చరణ్. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా సత్తా చాటిన డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. అలాగే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలకపాత్రలో నటిస్తున్నారు. అంతే కాదు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
- Rajeev Rayala
- Updated on: Mar 27, 2026
- 12:03 pm
Ram Charan: రామ్ చరణ్ గొప్ప మనసు.. అడగ్గానే ఆ డ్యాన్స్ మాస్టర్‌కు 40 లక్షలు ఇచ్చేసిన మెగా పవర్ స్టార్
సినిమాలు, నటన విషయంలో తన తండ్రి చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుంటాడు చిరంజీవి. అలాగే సేవా గుణంలోనూ మెగాస్టార్ నే ఫాలో అవుతుంటాడీ మెగా పవర్ స్టార్. ఆపదలో ఉన్న వారికి వెంటనే ఆపన్న హస్తం అందించే గొప్ప మనసు రామ్ చరణ్ ది.
- Basha Shek
- Updated on: Mar 27, 2026
- 11:33 am
పెద్ది షూటింగ్‌లో చరణ్‌కు గాయం కొద్దిలో తప్పిపోయిన ప్రమాదం ?
పెద్ది షూటింగ్‌లో రామ్ చరణ్‌కు యాక్షన్ సన్నివేశంలో స్వల్ప గాయం అయింది. ఈ ప్రమాదంపై టీమ్ స్పష్టతనివ్వగా, మెగా అభిమానులు ఆందోళన చెందారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
- Samatha J
- Updated on: Mar 27, 2026
- 10:45 am
Peddi: పెద్ది నుంచి అదిరిపోయే అప్డేట్.. చరణ్ ఇరగదీశాడు భయ్యా..!
పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. మెగాస్టార్ నట వారసుడిగా తెరంగేట్రం చేసి తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. అద్భుతమైన నటనతో సినీరంగంలో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. చిరు తర్వాత చరణ్ సినిమాలకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది.
- Rajeev Rayala
- Updated on: Mar 27, 2026
- 10:00 am