చంద్రబాబు నాయుడు
నారా చంద్రబాబు నాయుడు
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. తెలుగు దేశం పార్టీ(టీడీపీ) జాతీయ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమితో చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో చంద్రబాబు నవ్యాంధ్రకు రెండోసారి సీఎం అయ్యారు. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన ఘనత సాధించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు రెండుసార్లు, నవ్యాంధ్రకు రెండుసార్లు సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్ 20 ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నారు.
చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా 1973లో చంద్రబాబు రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎమర్జెన్సీ తర్వాత ఆయన 1978లో ఆయన కాంగ్రెస్ (ఐ) పార్టీలో చేరారు. ఆ ఏడాది చంద్రగిరి నియోకజవర్గం నుంచి కాంగ్రెస్ (ఐ) టికెట్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 28 సంవత్సరాల వయస్సులో రాష్ట్రంలోని అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే, మంత్రిగా ఘనత సాధించారు. 1980లో ఆయన ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ (ఐ)లోనే చంద్రబాబు కొనసాగారు. 1983 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వెంట్రామ నాయుడి చేతిలో ఓటమి తర్వాత, ఆయన కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
1995 నుండి 2004 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు. తన హయాంలో హైదరాబాద్‌లో ఐటీ రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2003లో అలిపిరి మందుపాతర పేలుడు ఘటనలో చంద్రబాబు గాయాలతో బయటపడ్డారు. తన ఏకైక సంతానం, కుమారుడు నారా లోకేశ్ ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మని వివాహం చేసుకోగా.. వారికి కుమారుడు దేవాన్ష్ ఉన్నారు.
యునైటెడ్ ఫ్రెంట్ ప్రభుత్వం కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. ఏపీ రాజకీయ నాయకుడిగానే కాకుండా జాతీయ నాయకుడిగా చంద్రబాబు గుర్తింపు సాధించారు.
లోక్‌సభ ముందుకు ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లు.. మద్దతు పలికిన కాంగ్రెస్, వైసీపీ వాకౌంట్!
అమరావతి చట్టబద్ధతకు మరో కీలక అడుగు పడింది. ఇవాళ బుధవారం (ఏప్రిల్ 01, 2026 ) ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని కేంద్రం ఆమోదించింది. ఆ తర్వాత లోక్‌సభ ముందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు తీసుకువచ్చారు. అయితే లోక్‌సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.
- Balaraju Goud
- Updated on: Apr 1, 2026
- 1:07 pm
Amaravati: అమరావతికి రాజముద్ర.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు.. లైవ్ వీడియో
పార్లమెంట్లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. లోక్‌సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ద్వారా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించనుంది కేంద్ర ప్రభుత్వం.. లోక్‌సభలో కేంద్రహోంశాఖ సహాయ మంద్రి నిత్యానంద రాయ్ బిల్లును ప్రవేశపెట్టారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత అంశంపై పార్లమెంట్లో చర్చ జరుగుతోంది. ఈ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది.
- Shaik Madar Saheb
- Updated on: Apr 1, 2026
- 12:16 pm
AP Assembly Live: అమరావతి ఇక బ్రాండ్.. ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. లైవ్ వీడియో
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్దత కోసం చర్యలు చేపట్టింది కూటమి ప్రభుత్వం.. భవిష్యత్‌లో ఎవరు అధికారంలో ఉన్నా.. రాజధానిగా అమరావతిని మార్చకుండా అసెంబ్లీలో తీర్మానం చేయబోతోంది. అందుకోసం ఇవాళ ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది. అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగా.. అమరావతికి చట్టబద్ధత కల్పించాలంటూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడుతున్నారు సీఎం చంద్రబాబు..
- Shaik Madar Saheb
- Updated on: Mar 28, 2026
- 11:15 am
అద్దిరిపోయే పెర్ఫామెన్సులు ఇక్కడ.. అందాల్సిన పురస్కారాలెక్కడ? విభజన తర్వాత స్క్రీన్‌ప్లే మారిందా?
నాటోన్లీ ఫార్మా, ఐటీ, బిర్యానీ.. సినిమా ఐకాన్‌గా కూడా హైదరాబాద్‌కి దేశవ్యాప్త గుర్తింపు ఉంది.. దీన్ని గ్లోబల్ సైజుకు తీసుకెళదామని తెలంగాణ ప్రభుత్వం కొత్తగా స్క్రీన్‌ప్లే రాసుకుంటోంది. సౌత్ కొరియా తరహాలో సినిమా రంగాన్ని ఎంకరేజ్ చేయాలని ఒక స్కెచ్ కూడా వేసుకుంది. కానీ, తెలుగు సినిమాకు రెండో కన్ను ఆంధప్రదేశ్ వాయిస్ ఏంటి? మాకు ఇప్పుడే తెలియాలి అని ఓపెన్‌గానే అడుగుతోంది ఇండస్ట్రీ పెద్దరికం. ఒక్క టాలీవుడ్.. రెండు రాష్ట్రాలు.. ఎవరికెంత ఎటాచ్మెంట్..?
- Balaraju Goud
- Updated on: Mar 20, 2026
- 9:45 pm
Andhra Pradesh: ఏపీ ప్రజలకు ప్రభుత్వం అదిరిపోయే ఉగాది గిఫ్ట్.. నేటి నుంచి వీరికి కూడా ఫ్రీ బస్.. ఈ బస్సుల్లోకే ఎంట్రీ
ఏపీలోని కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఉగాది గిఫ్ట్ ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉచితంగా బస్సు ప్రయాణం అందించనుంది. ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఇవాళ తీసుకురానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకానికి బుధవారం అమరావతిలో శ్రీకారం చుడతారు.
- Venkatrao Lella
- Updated on: Mar 18, 2026
- 7:19 am
Andhra Pradesh: ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరోసారి కరెంట్ ఛార్జీలు తగ్గింపు.. చంద్రబాబు కీలక ప్రకటన
ఏపీలోని ప్రజలకు కూటమి సర్కార్ శుభవార్త అందించింది. రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలను మరింత తగ్గించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. బుధవారం సచివాలయంలో కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని పలు కీలక సూచనలు చేశారు.
- Venkatrao Lella
- Updated on: Mar 11, 2026
- 5:25 pm
CM Chandrababu- Manchu Manoj: సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన మంచు మనోజ్.. ఏం జరిగిందంటే? వీడియో
గతేడాది భైరవం, మిరాయ్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించాడు రాక్ స్టార్ మంచు మనోజ్. ఇందులో మిరాయ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం డేవిడ్ రెడ్డి అనే మూవీలో నటిస్తున్నాడు మంచు మనోజ్. అయితే తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై ప్రశంసలు కురిపించాడు మనోజ్.
- Basha Shek
- Updated on: Mar 7, 2026
- 7:45 am
CM Chandrababu: ప్రపంచం మెచ్చేలా అమరావతిని నిర్మిస్తాం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు అమరావతిపై కీలక హామీ ఇచ్చారు. కేంద్ర సహకారంతో అమరావతిని ట్రాక్‌లో పెట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో నంబర్ వన్ రాజధానిగా, ప్రపంచం మెచ్చుకునే విధంగా అమరావతిని నిర్మిస్తామని ఆయన దృఢంగా ప్రకటించారు. ఇది రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగమని ఆయన పేర్కొన్నారు.
- Phani CH
- Updated on: Mar 6, 2026
- 4:44 pm
Vetlapalem Blast: ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
వెలుగుపూల కెమికల్ పగడ.. వేట్లపాలెంను చీకటి చేసేసింది. పచ్చని గోదావరి తీరాన్ని మరో శివకాశిలా మరుభూమిగా మార్చేసింది. ఎంత ఘోరం..ఎంత విషాదం...? ఈ దారుణం వెనుక నిర్లక్ష్యం ఎవరిది? ముప్ఫై... నలభై... నలభై ఐదు... యాభై.. యాభై ఐదు... ఇవి నెంబర్లు కాదు. అన్ని అడుగుల దూరం మృతదేహాలు చెల్లాచెదురగా పడ్డాయంటే పేలుడు తీవ్రత ఎంతో అర్ధం చేసుకోవచ్చు. వేట్లపాలెం ఘటన బాధితుల్లో సామాన్యులే ఎక్కువ. రెక్కాడితే గాని బతుకు బండి నడవని అభాగ్యుల జీవితాలను బుగ్గి పాలు చేసింది ఎవరి నిర్లక్ష్యం?..
- Shaik Madar Saheb
- Updated on: Mar 1, 2026
- 8:33 am
CM Chandrababu: సొంతింటి కోసం ఎదురుచూస్తున్నవారికి సీఎం చంద్రబాబు భారీ శుభవార్త.. స్థలం కూడా ఫ్రీ.. ఎప్పటినుంచంటే..?
శుక్రవారం అసెంబ్లీలో పేదలకు ఇళ్ల కేటాయింపుపై సీఎం చంద్రబాబు మాాట్లాడారు. ఈ సందర్భంగా కొత్త ఇళ్ల మంజూరు, ఉచితంగా స్థలాలు కేటాయింపుపై క్లారిటీ ఇచ్చారు. కొత్తగా ఇంటి కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇక స్థలాలు లేనివారికి స్థలాలను కూడా ఉచితంగా కేటాయిస్తామన్నారు.
- Venkatrao Lella
- Updated on: Feb 27, 2026
- 6:46 pm
ఏపీ అసెంబ్లీలో సెగలు పుట్టించిన ‘కల్లీ నెయ్యి’.. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన
ఏపీ అసెంబ్లీ తొమ్మిదవ రోజు మంగళవారం 'కల్లీ నెయ్యి' సెగలు పుట్టించింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల లడ్డూ కల్తీ అంశంపై ఏపీ శాసనసభలో హై-వోల్టేజ్ క్రియేట్ చేసింది. ఒకవైపు భక్తుల సెంటిమెంట్.. మరోవైపు వ్యాపార భాగస్వామ్యాల చుట్టూ తిరుగుతున్న ఆరోపణల నేపథ్యంలో.. అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
- Balaraju Goud
- Updated on: Feb 24, 2026
- 2:09 pm
ఏపీ ప్రజలకు తీపి కబురు చెప్పిన ప్రభుత్వం.. ఏడాదిన్నరలోగా ప్రతి ఇంటికి..!
గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ పెంచేలా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదివారం సీఎం క్యాంప్ కార్యాలయంలో కీలక సహకార ఒప్పందం కుదిరింది. సుమారు 5 లక్షల గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఫైబర్ కనెక్షన్లు అందించే లక్ష్యంతో అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్-ఏబీఎన్‌పీ అమలు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
- Balaraju Goud
- Updated on: Feb 23, 2026
- 7:27 am