AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ బాబు

మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు.. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకొని అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. బాల నటుడిగా పలు సినిమాల్లో నటించిన మహేష్ బాబు.. రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న మహేష్ అనతికాలంలోనే స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు సూపర్ స్టార్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు.

మహేష్ బాబు సినిమాలతో పాటు పలు సేవాకార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. దాదాపు 1200 మంది పిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయించి వారి కుటుంబంలో వెలుగులు నింపాడు. మహేష్ బాబును టాలీవుడ్ అందగాడు అని పిలుస్తూ ఉంటారు. చూడటాన్ని హాలీవుడ్ హీరోలా ఉండే మహేష్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని మహేశ్ బాబు 1975 ఆగస్టు 9న జన్మించారు. ఈయన ప్రఖ్యాత నటుడు కృష్ణ కుమారుడు. బాలనటుడిగా 8 కి పైగా సినిమాల్లో నటించాడు. సూపర్‌ హిట్ సినిమాల్లో కథానాయకుడిగా మెప్పించాడు. మొదటి సినిమా రాజకుమారుడు తోనే నంది ఉత్తమ నూతన నటుడి పురస్కారం అందుకున్నాడు. 2003 లో వచ్చిన నిజం సినిమాకు మొదటి సారిగా నంది ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నాడు. తర్వాత 2005 లో వచ్చిన అతడు, 2011 లో వచ్చిన దూకుడు, 2015 లో వచ్చిన శ్రీమంతుడు చిత్రాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు గెలుచుకున్నాడు. ఇక వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ప్రముఖ బాలీవుడ్ నటి నమ్రత శిరోద్కర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు గౌతమ్‌, సితార అనే ఇద్దరు పిల్లలున్నారు.

ఇంకా చదవండి

Varanasi: రాజమౌళిలో ఈ మార్పేంటి.. మహేష్ ఏం చేసారు..?

సాధారణంగా రాజమౌళి సినిమాల్లో హీరోలకు మినహాయింపులు ఉండవు. కానీ 'వారణాసి' చిత్రం కోసం మహేష్ బాబుకు జక్కన్న ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్నారు. వెకేషన్లకు అనుమతిస్తూనే, సినిమాను మాత్రం జెట్ స్పీడ్‌తో పూర్తి చేస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న విడుదల లక్ష్యంగా, ఆగస్టు నాటికి మహేష్ షూటింగ్ ముగించి, ప్రమోషన్లకు సిద్ధమవుతున్నారు. ఇది రాజమౌళి శైలిలో అరుదైన మార్పు.

Director : మహేష్ బాబు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. డైరెక్టర్ కామెంట్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ లెవల్లో రిలీజ్ చేయనున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ సైతం ఈ చిత్రంలో భాగమవ్వడంతో.. మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

ఆ హీరో మనసు బంగారం.. కళ్ళజోడు కావాలని అడిగితే షాపే కొనిస్తా అన్నాడు..

విలక్షణ నటనతో ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నారు నటుడు సముద్రఖని. దర్శకుడిగా, రచయితగా రాణించిన సముద్రఖని ఇప్పుడు విలన్ పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. అలవైకుంఠపురంలో, క్రాక్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో అదరగొట్టిన సముద్ర ఖని. దర్శకుడిగానూ సినిమాలు చేసి మెప్పించారు సముద్రఖని. తాజాగా ఆయన ఓ హీరో గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Mahesh Babu: ఆంధ్రప్రదేశ్‌లో హీరో మహేష్ బాబు పోలికలతో రాముడి విగ్రహం.. ఫొటోస్ వైరల్

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఓ గుడిలో ఉన్న శ్రీరాముడి విగ్రహం ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఎందుకంటే ఈ రాములోరి విగ్రహం అచ్చం హీరో మహేశ్‌ బాబులాగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ దేవాలయంలో ఆ రాముడి విగ్రహం ఉందని ఓ నెటిజన్‌ పోస్ట్‌ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.

మహేష్, పవన్ సినిమాలకు నో చెప్పిన స్టార్ నటుడు.. బ్రతికినంత కాలం హీరోగానే

సినిమా ఇండస్ట్రీలో ఆయన ఓ తోప్ హీరో.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఫ్యామిలీ ఆడియన్స్ లో ముఖ్యంగా లేడీస్ లో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు ఆ స్టార్ హీరో. కానీ ఆయన బ్రతికినంత కాలం హీరోగానే ఉన్నారు.

ఆరు నెలల్లోనే ఆ నిర్ణయం తీసుకున్నాం.. విడాకులపై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్

ప్రియాంక చోప్రా ఇన్నాళ్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసింది. ప్రస్తుతం హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది. ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళీ కాంబోలో వస్తున్న వారణాసి చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

మహేష్ కాకుండా ఇప్పటి హీరోల్లో అతనంటేనే ఇష్టం.. కృష్ణ చెప్పిన పేరు వింటే పూనకాలే

తెలుగు సినిమా చరిత్రలో చెరిగిపోని స్థానం సంపాదించుకున్న నటుల్లో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. తెలుగు సినిమాల్లో ఆయన ఓ శిఖరం.. ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీని షేక్ చేశారు కృష్ణ. బుర్రిపాలే అనే గ్రామం నుంచి వచ్చిన కృష్ణ రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్నారు.

ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది.. నేను చేసిన తప్పు అదే

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. నెక్స్ట్ ఎవరితో సినిమా చేయబోతున్నారు అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. పుష్ప , పుష్ప 2 సినిమాలతో భారీ పాన్ ఇండియా హిట్స్ అందుకున్న సుకుమార్.. తన నెక్స్ట్ సినిమా రామ్ చరణ్ తో తీస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

Mahesh Babu: మహేష్ బాబును అన్నా అని పిలిచిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా? సూపర్ స్టార్ సైతం అవాక్కయ్యాడట..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమా కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించాడు. ప్రీతిజింటా, అమృతా రావు, బిపాసాబసు, కియారా అద్వానీ, ప్రియాంక చోప్రా లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం సూపర్ స్టార్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

క్రికెట్ ఆడుతున్న ఈ కుర్రాడు, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అని తెలుసా?

స్టార్ హీరోల చైల్డ్ హుడ్ ఫొటోస్ ఎప్పుడూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఓ పాన్ ఇండియా స్టార్ చిన్ననాటి ఫొటో నెట్టింట హల్ చల్ చేస్తుంది. క్రికేట్ ఆడుతున్న ఓ కుర్రాడి ఫొటో వైరల్‌గా మారింది. మరి ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా?

చిరంజీవి, మహేష్‌లతో ఉన్న ఈకుర్రాడిని గుర్తు పట్టారా? ఒకప్పుడు టైలర్.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతోన్న వారిలో చాలా మంది కెరీర్ ప్రారంభంలో చిన్నా చితకా పనులు చేసిన వారే. పొట్ట కూటి కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన వారే. ఇతను కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు.

Mahesh Babu: అల్లు అర్జున్‌ లాగే వైజాగ్‌లో మహేష్ పెట్టుబడులు ??

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, AMB సినిమాస్‌తో మల్టీప్లెక్స్ రంగంలో దూసుకుపోతున్నారు. హైదరాబాద్‌లో విజయవంతమైన AMB బ్రాండ్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. ఇటీవల బెంగళూరులో అత్యాధునిక మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. త్వరలో విశాఖపట్నం, గోవా, కేరళ, తమిళనాడులో AMB సినిమాస్ ప్రాజెక్టులు రానున్నాయి. ఈ వ్యాపార విస్తరణతో మహేష్ బాబు దేశవ్యాప్తంగా తన ముద్ర వేయనున్నారు.

  • Phani CH
  • Updated on: Mar 13, 2026
  • 8:19 pm