AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్ తెలుగు 9

బిగ్ బాస్ తెలుగు 9

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9పై సర్వత్రా ఆసక్తినెలకొంటోంది. బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమైంది. అయితే ఈ సారి బిగ్ బాస్ 9వ సీజన్‌ గత సిజన్‌కంటే భిన్నంగా ఉండనుంది. గత కొన్ని రోజుల నుంచి బీబీ సీజన్ 9కి సంబంధించిన సన్నాహాలను స్టార్ మా నిర్వాహకులు మొదలు పెట్టి రసవత్తరంగా కొనసాగిస్తున్నారు. సీజన్ 9కు కూడా అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 1కి జూనియర్ ఎన్టీఆర్, సీజన్ 2కి నాని హోస్ట్‌గా వ్యవహరించారు. సీజన్ 3 నుంచి సీజన్ 8 వరకు హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జున.. ఈ సీజన్‌కు కూడా ఆయనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటి వరకు వచ్చిన సీజన్స్ కు భిన్నంగా ఈ సీజన్ 9 ఉండేలా ప్లాన్ చేశారు మేకర్స్.  దీంతో బీబీ సీజన్ 9పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటోంది.ఈ సీజన్‌లో రోజుకో కొత్తగా ఉండనుందని ఇప్పటికే నిర్వాహకులు చెబుతుండగా, అదే విధంగా ఉంటోంది. సీజన్ 9లో కొత్త నిబంధనలు, కొత్త గేమ్స్‌తో మరింత ఆసక్తికరంగా.. వినూత్నంగా ఉండేలా ఉంటుందని స్టార్ మా వర్గాలు చెబుతున్నాయి. కాగా ఎలాంటి అంచనాలు లేకుండా రైతు బిడ్డగా హౌజ్‌లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్‌గా నిలవడం తెలిసిందే. టీఆర్పీ పరంగా బిగ్‌బాస్ సీజన్ 7 పాత రికార్డులను తిరగరాసింది. ఆ తర్వాత సీజన్ 8 లో నిఖిల్ విన్నర్ గా నిలిచాడు. ఈ సీజన్  కూడా మంచి టీఆర్పీ దక్కించుకుంది. దీంతో బీబీ సీజన్ 9పై కూడా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటోంది.

ఇంకా చదవండి

నాన్న నాన్న నాన్న.. నీ మనసెంత మంచిదో నాన్న..! భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ

బిగ్ బాస్ తెలుగు సీజన్ తుది దశకు చేరుకుంది. సెప్టెంబర్ 07న అట్టహాసంగా ప్రారంభమై ఎన్నో ట్విస్టులతో సాగిన ఈ రియాలిటీ షోకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడనుంది. డిసెంబర్‌ 21న గ్రాండ్ ఫినాలే ఫైనల్‌ ఎపిసోడ్‌ జరగనుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. టాప్-5 కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేను ప్లాన్ చేశారు మేకర్స్.

Bigg Boss Telugu 9: ‘బిగ్‌బాస్‌ తెలుగు 9’ ప్రైజ్‌ మనీ అనౌన్స్ చేసిన నాగార్జున.. ఈసారి ఎన్ని లక్షలో తెలుసా?

సాధారణంగా బిగ్ బాస్ రియాలిటీ షో విజేతలకు భారీగానే ప్రైజ్ మనీ అందుతుంది.అలాగే స్పాన్సర్ కంపెనీలు కూడా వివిధ రకాల బహమతులను అందజేస్తుంటాయి. లగ్జరీ కార్లు, గోల్డ్ ఛైన్స్ .. ఇలా రకరకాల కానుకలు విజేతలకు అందుతుంటాయి. అలా ఈ సీజన్ లో కూడా..

Bigg Boss : మాకేందిరా ఈ రచ్చ.. బిగ్‌బాస్‌ డార్క్ రూమ్‌లో కంటెస్టెంట్ల ముద్దులాట.. వైరలవుతున్న వీడియో..

‏బుల్లితెరపై అతిపెద్ రియాల్టీ షో అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు బిగ్ బాస్. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో ఈ షోకు మంచ రెస్పాన్స్ వస్తుంది. ఓవైపు విమర్శలు, నెగిటివిటీ ఉన్నప్పటికీ ఈ షో చూసే అడియన్స్ సంఖ్య తగ్గడం లేదు. ఇప్పుడు తెలుగులో ఈ షో ముగింపు దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో ఈ సీజన్ విన్నర్ ఎవరనేది తెలియనుంది.

Bigg Boss 9 Telugu : సుమన్ శెట్టి ప్రభంజనం.. బిగ్‏బాస్ హిస్టరీలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్.. 14 వారాలకు ఎంత సంపాదించాడంటే..

బిగ్ బాస్ సీజన్.. ఇక ఒక్క వారం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనున్నట్లు అనౌన్స్ చేసిన హోస్ట్ నాగ్.. శనివారం సుమన్ శెట్టి హౌస్ నుంచి బయటకు వచ్చారు. దాదాపు 14 వారాలు హౌస్ లో ఉండి గట్టి పోటీ ఇచ్చాడు సుమన్ శెట్టి. మొదటి నుంచి తన మాట తీరు.. ప్రవర్తనతో అడియన్స్ హృదయాలు గెలుచుకున్నారు సుమన్ శెట్టి. ఎలాంటి నెగిటివిటీ లేకుండా 14 వారాల తర్వాత హౌస్ నుంచి బయటకు వచ్చాడు.

Bigg Boss 9 Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బయటకు.. టాప్ 5 వీళ్లే..

బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో సెకండ్ ఫైనలిస్ట్ కోసం టాస్కులు జరుగుతున్న సంగతి తెలిసింద. ఇప్పుడు హౌస్ లో సుమన్ శెట్టి, భరణి, సంజన, తనూజ, కళ్యాణ్ పడాల, డీమాన్ పవన్, ఇమ్మాన్యూయేల్ ఉన్న సంగతి తెలిసిందే.

Bigg Boss 9 Telugu: ఇక మరవా అక్క.. బాధతో విలవిలలాడిన ఇమ్మూ.. మళ్లీ తొండాట ఆడి గెలిచిన తనూజ..

బిగ్ బాస్ సీజన్ 9 చివరి అంకానికి చేరుకుంది. మరికొన్ని రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరుగనుంది. ఈసారి విన్నర్ ఎవరనేది తెలియనుంది. ఇప్పటికే కళ్యాణ్ పడాల ఫస్ట్ ఫైనలిస్ట్ కాగా.. సెకండ్ ఫైనలిస్ట్ కోసం వరుస టాస్కులు జరుగుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో మరోసారి అడ్డంగా దొరికిపోయింది.

Emanuel: టాస్క్‌లో గాయపడ్డ ఇమ్మాన్యుయేల్‌! నొప్పితో విలవిల

ఇమ్మూ ఈ సీజన్‌లో అద్భుతంగా ఆడుతూ టికెట్ టు ఫినాలే రేసులో నిలబడ్డాడు. అయితే, శారీరకంగా, మానసికంగా అలసిపోయిన ఇమ్మూ, తనుజతో జరిగిన టాస్క్‌లో కాలు బెణికి గాయపడ్డాడు. దీనితో ఆట మధ్యలో ఆగిపోయి మెడికల్ రూమ్‌కు వెళ్లాడు. ఈ గేమ్‌లో తనుజ గెలిచి రెండో ఫైనలిస్ట్‌ అయ్యింది, అయితే ఆమె ఇమ్యూనిటీని తిరస్కరించింది.

  • Phani CH
  • Updated on: Dec 13, 2025
  • 8:52 am

పాపం తనూజ..! అతడి కామెంట్‌కు ముఖం మాడ్చుకుంది

బిగ్ బాస్ లీడర్‌బోర్డులో ఫస్ట్ ఉన్న తనూజకు ప్రేక్షకులు గట్టి ఝలక్ ఇచ్చారు. ఓట్ అప్పీల్ చేసుకున్నప్పటికీ, ఆమె ఎమోషన్స్ 'నకిలీ' అని ప్రశ్నించారు. భరణిని 'నాన్న' అనకుండా 'సర్' అనడంపై, ఇమ్మాన్యుయేల్‌తో ఫ్రెండ్‌షిప్‌పై నిలదీశారు. తాను అందరి సపోర్ట్ తీసుకుంటుందని, కానీ ఇతరులకు ఇవ్వదని ఘాటు రిప్లై ఇవ్వడంతో తనూజ ముఖం వాడిపోయింది.

  • Phani CH
  • Updated on: Dec 13, 2025
  • 8:48 am

Bigg Boss Telugu 9: అయ్యో.. ఫైనలిస్ట్ టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్ కు గాయాలు.. బిగ్‌బాస్ సంచలన నిర్ణయం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆఖరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం హౌస్ లో సెకెండ్ ఫైనలిస్ట్ కోసం కంటెస్టెంట్ల మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. అయితే ఈ ఫైనలిస్ట్ టాస్కుల్లో భాగంగా టాప్ కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్ గాయ పడ్డాడు. దీంతో..

Bigg Boss 9 Telugu : నువ్వు ఫేక్.. తనూజను కడిగిపారేసిన అడియన్స్.. దెబ్బకు బిత్తరపోయిందిగా..

బిగ్ బాస్ టైటిల్ ఆమెకే అంటూ మొదటి నుంచి ప్రచారం నడుస్తుంది. ఓవైపు ఆమెకు పాజిటివిటీ ఉన్నప్పటికీ నెగిటివిటీ కూడా అదే స్థాయిలో ఉంది. కొందరు తనూజ జెన్యూన్ అంటే.. మరికొందరు మాత్రం ఆమె ఫేక్ అని.. పక్కా మాస్టర్ ప్లాన్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక గురువారం నాటి ఎపిసోడ్ లో అడియన్స్ ప్రశ్నలకు బిత్తరపోయింది తనూజ.

Actress Himaja : ఎంతగా మిస్ అవుతున్నానో మాటల్లో చెప్పలేను.. బిగ్‏బాస్ ఫేమ్ హిమాజ ఎమోషనల్ పోస్ట్..

బుల్లితెర ప్రేక్షకులకు అంతగా పరిచయం అక్కర్లేని పేరు హిమజ. ఒకప్పుడు సీరియల్స్ ద్వారా అలరించిన ఆమె.. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఎక్కువగా ఫేమస్ అయ్యింది. ఈ షో తర్వాత సీరియల్స్ చేయకపోయినా నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా నెట్టింట భావోద్వేగ పోస్ట్ చేసింది.

BiggBoss 9: విన్నర్ అతనే.. గూగుల్ కూడా ఫిక్స్ అయ్యిపోయింది.. రన్నర్ ఎవరంటే

బిగ్ బాస్ సీజన్ 9 మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం సుమన్ శెట్టి, భరణి, సంజన, తనూజ, కళ్యాణ్ పడాల, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్ హౌస్ లో ఉన్నారు. వీరిలో ఈ సీజన్ టైటిల్ విజేత ఎవరనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది.