కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) చరిత్ర సృష్టించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఈ సారి విజయం సాధించి సీఎంగా హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఉద్యమమే ఊపిరిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు కేసీఆర్. ప్రస్తుత ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు. తనకు రూ.58.92 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తన ఎన్నికల అఫిడవిడ్‌లో కేసీఆర్ వెల్లడించారు. అయితే తన పేరిట కారు లేదని తెలిపారు.

మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మించారు. సిద్ధిపేట డిగ్రీ కాలేజీలో బీఏ, ఉస్మానియి యూనివర్సిటీలో ఎంఏ (తెలుగు సాహిత్యం) చదువుకున్నారు. 1969లో శోభను వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత ఉన్నారు.

తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే కేసీఆర్ రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. 70వ దశకంలో యువజన్ కాంగ్రెస్ ద్వారా తన రాజకీయ ప్రవేశం చేశారు. 1982లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టడంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 1983లో తన రాజకీయ గురువు అనంతుల మదన్‌ మోహన్‌(కాంగ్రెస్)పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కేసీఆర్ కేవలం 877 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ.. ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్నారు.

ఇంకా చదవండి

KCR Tour: నిషేధం తర్వాత జనంలోకి కేసీఆర్… పద్దతిగా మారేనా? మరింతగా డోసు పెంచుతారా ?

48 గంటల నిషేధం తర్వాత ఇవాళ మళ్లీ ప్రచారం నిర్వహించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌. అయితే ఇకపై పద్దతిగా మాట్లాడతారా? లేక మరింతగా మాటల డోసు పెంచుతారా ? అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు కేసీఆర్‌ ప్రచారం చేయకుండా 48 గంటల బ్యాన్‌ విధించడం బీజేపీ, కాంగ్రెస్‌ కుట్ర అంటున్నారు బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు

Modi on Third Front: కేసీఆర్ థర్డ్‌ ఫ్రంట్‌ డైలాగ్‌కి మోదీ కౌంటర్.. కేసీఆర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి..?

ఆప్షన్‌1, ఆప్షన్2, ఆప్షన్3 అంటూ నేషనల్ పాలిటిక్స్‌లో తన ఫ్యూచర్‌ని వెతుక్కుంటున్నారు గులాబీ దళపతి కేసీఆర్. కానీ.. ఫస్ట్ ఆప్షన్‌కి నో చెప్పేశారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇప్పుడు సెకండ్ ఆప్షన్‌ని కూడా తిరగ్గొట్టేశారు ప్రధాని నరేంద్ర మోదీ. టీవీ9కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో కేసీఆర్ పొలిటికల్ ఫ్యూచర్‌పై ప్రధాని మోద క్లారిటీ ఇచ్చేశారు.

PM Modi: కేసీఆర్ సంకీర్ణ ప్రభుత్వం కామెంట్‎పై మోదీ స్పందన..

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తూ కేసీఆర్ పేల్చిన సంకీర్ణం బాంబ్.. నేషనల్ పాలిటిక్స్‌లో సైతం కదలిక తీసుకొచ్చింది. నామాకు కేంద్రమంత్రి యోగం ఉందన్న కేసీఆర్ మాటల్లో మర్మం ఏంటి అనే చర్చ మొదలైంది. కేంద్రంలో సంకీర్ణం వస్తోందన్న కేసీఆర్ జోస్యంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. టీవీ9 నెట్‌వర్క్‌కిచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ పొలిటికల్ ఫ్యూచర్‌పై క్లారిటీ ఇచ్చారు మోదీ.

  • Srikar T
  • Updated on: May 2, 2024
  • 10:03 pm

కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. ఈసీ కీలక ఆదేశాలు.. ఎప్పటివరకంటే..

తెలంగాణలో కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటలు నిషేధం విధించింది ఈసీ. సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై అవమానకరంగా, అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించినందుకు ఈసీ కేసీఆర్ ప్రచారంపై వేటు వేసింది. ఈరోజు రాత్రి 8 గంటల నుంచే ఈ నిబంధన అమలులో ఉండనున్నట్లు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఈసీ సీరియస్ అయింది.

  • Srikar T
  • Updated on: May 1, 2024
  • 7:27 pm

KCR: కేసీఆర్‌ చెప్తున్నట్టు ఎన్డీఏ కూటమికి ఈసారి నంబర్‌ తగ్గుతుందా..? బీజేపీ, కాంగ్రెస్‌ లేని కూటమి సాధ్యమేనా?

గుణాత్మక మార్పు అనే నినాదం గతంలో వినిపించిన గులాబీ బాస్‌, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తాజాగా కేంద్రప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తానని తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అనే కొత్తరాగం అందుకున్నారు. భారత రాష్ట్ర సమితి పనైపోయిందనీ, ఒక్క సీటు రావడమే గగనమంటూ ప్రత్యర్థులు లైట్‌ తీసుకుంటున్నవేళ, తన లెక్కేంటో చెబుతున్నారు కేసీఆర్‌.

KCR: భారీ బందోబస్తుతో ఉండే కేసీఆర్.. రోడ్డు పక్కన గుడిసె హోటల్‌లో బజ్జీలు తింటూ కనిపించిన గులాబీ బాస్

లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు గెలవటమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా బస్సు యాత్రను చేస్తున్న ఆయన.. ఖమ్మం వెళ్తుండగా మార్గమధ్యలో ఎల్లంపేట స్టేజ్ తండా దగ్గర తన కాన్వాయ్ ఆపించారు. రోడ్డుపక్కన ఉన్న ఓ చిన్న హోటల్‌లో కాసేపు సేదతీరారు. హోటల్‌లో బజ్జీలు, పకోడి తింటూ టీ తాగుతూ ఆస్వాదించారు.

Watch Video: ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్‎పై విమర్శలు..

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. ఆదివారం సాయంత్రం రోడ్ షో నిర్వహించిన రేవంత్ రెడ్డి బీజేపీపై మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో కాకుండా శ్రీరాముడి ఫోటోతో బీజేపీ ఓట్లు అడుగుతుందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంలో తగదని విమర్శించారు. మల్కాజిగిరితో పాటు ఎల్బీనగర్‌ రోడ్‌ షోలో పాల్గొన్న సీఎం రేవంత్ అటు బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌పై కూడా సెటైర్లు విసిరారు.

  • Srikar T
  • Updated on: Apr 28, 2024
  • 9:54 pm

Revanth Reddy: 5 సీట్లకు వారి మధ్య ఒప్పందం కుదిరింది.. బీజేపీ- బీఆర్ఎస్‌పై రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

బీజేపీ- బీఆర్ఎస్ మధ్య ఒప్పందం బయటపడింది.. ఈటల రాజేందర్ గెలుస్తారన్న మల్లారెడ్డి వ్యాఖ్యలే దీనికి అద్దం పడుతున్నాయి.. బీజేపీ గెలుస్తుందన్న మల్లారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు.. 5 సీట్లకు వారి మధ్య ఒప్పందం కుదిరింది.. అంటూ మరోసారి సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్, బీజేపీపై సంచలన ఆరోపణలుచేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలుచేశారు.

KTR: కాంగ్రెస్‌కు ఓ విధానం ఉందా? వాళ్లను ఏమనాలో అర్ధం కావట్లేదన్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

రేవంత్‌ రెడ్డి ఇంఛార్జీగా ఉన్న రెండు చోట్లా కాంగ్రెస్‌ ఓడుతుంది.. ఎన్నికల ముందు అభయహస్తం.. ఇప్పుడు భస్మాసురహస్తం రేవంత్‌ నైజం..అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. రుణమాఫీ అని డిసెంబర్‌ 9 వరకు మోసం 1 చూపించారు.. ఇప్పుడు ఆగస్ట్‌ 15లోపు రుణమాఫీ అంటూ మోసం 2 చూపిస్తున్నారు.. అంటూ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.

Watch Video: తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..

తెలంగాణలో కరెంట్ కోతలపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఒక ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయన్నారు. తాను గంట క్రితం మహబూబ్ నగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రచారం అనంతరం ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేశామన్నారు.

  • Srikar T
  • Updated on: Apr 27, 2024
  • 4:33 pm

‘అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా’..? భువనగిరి ఎన్నికల ప్రచారంలో కేసీఆర్..

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో దూసుకు పోతున్నారు మాజీ సీఎం కేసీఆర్. 58 ఏళ్లలో ఎన్నో కష్టాలు పడ్డామన్నారు. భువనగిరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ తన ప్రాణం పోయినా బీజేపీకి లొంగను అని భావోద్యేగ ప్రసంగం ఇచ్చారు. తన బిడ్డ కవితను అన్యాయంగా జైలులో కూర్చోబెట్టారన్నారు. దేశంలో ప్రతిరోజు మహిళలపై దాడులగురించి వార్తలు వింటున్నామన్నారు. డాలర్ తో రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పడిపోయిందని చెప్పారు.

  • Srikar T
  • Updated on: Apr 25, 2024
  • 9:33 pm

ఈ జిల్లా గులాబీ అడ్డా.. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీమంత్రి హరీష్‌ రావు..

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మెదక్ రోడ్ షోలో ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. అమరవీల స్థూపం వద్దకు రాజీనామా పత్రంతో తాను వస్తానని.. నువ్వు వస్తావా.. అని ప్రశ్నించారు. ఆగష్టు 15 లోపు రుణమాఫీ చేయడం నిజమైతే, ఆరు హామీలు అమలు చేయడం నిజం అయితే అమరవీరుల స్థూపం వద్దకు రా.. రాజీనామా లేఖలను ఇద్దరం మేధావుల చేతిలో పెడదామన్నారు. నువ్వు చెప్పినవి అమలు చేస్తే తన రాజీనామా లేఖను ఆ మేధావులు, స్పీకర్‎కి ఇస్తారు.

  • Srikar T
  • Updated on: Apr 25, 2024
  • 3:01 pm

KCR Bus Yatra: నల్లగొండ నుండి పార్లమెంట్ ఎన్నికల సమర శంఖాన్ని పూరించిన కేసీఆర్..

అసెంబ్లీ ఎన్నికలో దెబ్బతిన్న బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. విప్లవాల ఖిల్లా నల్లగొండ జిల్లా నుంచి పార్లమెంట్ అవున ఎన్నికల శంఖారావాన్ని మోగించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోరు గడ్డ నుంచి కేసీఆర్ పోరుబాట పేరుతో బస్సు యాత్రను మొదలుపెట్టారు.

Telangana: కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్రగా నల్గొండ జిల్లాకు చేరుకున్న కేసీఆర్‌కు, తొలిరోజే ఎదరైన సంఘటన ఇది. ఆర్జాలబాయి దగ్గర రైతన్నలు కేసీఆర్‌ బస్సుని ఆపారు. తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు. కొన్ని రోజులుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ తమ గోడు వెల్లబుచ్చుకున్నారు. మీరు ఉన్నప్పుడే బాగుందంటూ తమ బాధను కేసీఆర్‌కు చెప్పుకున్నారు రైతులు. అలాగే ఐకేపీ సెంటర్లో గన్నీ బ్యాగులతో ప్రదర్శన చేశారు రైతన్నలు.

  • Srikar T
  • Updated on: Apr 24, 2024
  • 9:51 pm

Watch Video: ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..

కేసీఆర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. పలు వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. తృటిలో పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా లోక్ సభ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న కేసీఆర్ కాన్వాయ్‎లో ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్‎లో ప్రయాణిస్తున్న సమయంలో ఒక వాహనానికి మరొకటి ఢీకొని అలా 8 వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. కాన్వాయ్ లో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కేసీఆర్ సహా అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

  • Srikar T
  • Updated on: Apr 24, 2024
  • 8:43 pm
Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?