నరేంద్ర మోదీ
నరేంద్ర మోదీ ప్రస్తుత భారత ప్రధాని. 2014 మేలో తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించడంతో మోదీ వరుసగా రెండోసారి దేశ ప్రధాని అయ్యారు. దేశ ప్రధాని కావడానికి ముందు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు.
నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో అనుబంధం కలిగి ఉన్నారు. గతంలో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో కూడా పనిచేశారు. ఆయన గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు.
2014 లోక్‌సభలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ విజయం సాధించింది. దీని తర్వాత, 2019లో కూడా బీజేపీ ఘన విజయం సాధించి, మోదీ మళ్లీ భారత ప్రధాని అయ్యారు. 2014 నుంచి బీజేపీ మోదీ పేరును ప్రధాన అస్త్రంగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయం సాధించింది.
తన హయాంలో, ప్రధాని మోడీ చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇది అయనపై దేశ ప్రజల్లో ఆదరణను మరింత పెంచింది. ఈ నిర్ణయాలలో పాకిస్థాన్‌లో సర్జికల్ స్ట్రైక్స్, పెద్ద నోట్ల రద్దు, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, ట్రిపుల్ తలాక్ చట్టం అమలు మొదలైనవి ఉన్నాయి.
PM Modi: కామ్రేడ్ల కంచుకోటలో ఎగిరిన బీజేపీ జెండా.. ప్రధాని మోదీ సంచలన ట్విట్..
కేరళలోని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేసింది. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లోని 101 వార్డులలో భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) 50 వార్డులను గెలుచుకుని సరికొత్త చరిత్రను లిఖించింది.
- Shaik Madar Saheb
- Updated on: Dec 13, 2025
- 4:05 pm
జనాభా లెక్కలు, కోల్ సేతు, రైతుకు మద్దతు.. ప్రధాని మోదీ కేబినెట్ కీలక నిర్ణయం..!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం (డిసెంబర్ 12, 2025) జరిగిన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా మూడు నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2027 జనాభా లెక్కలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు.. ఇందు కోసం రూ. 11,718 కోట్ల బడ్జెట్ ఆమోదించింది.
- Balaraju Goud
- Updated on: Dec 12, 2025
- 5:00 pm
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్ కాల్.. ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక పురోగతి!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సమీక్షించినట్లు సమాచారం. భారతదేశం-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని ఇద్దరు నాయకులు సమీక్షించారు. వాణిజ్యం, కీలక సాంకేతికతలు, ఇంధనం, రక్షణ, భద్రతా రంగాలలో సహకారాన్ని విస్తరించడంపై ప్రధాని మోదీ - ట్రంప్ చర్చించారు.
- Balaraju Goud
- Updated on: Dec 11, 2025
- 8:08 pm
‘మీ డబ్బు, మీ హక్కు’ ఉద్యమంలో పాల్గొనండి.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!
మీరు, లేదా మీ పూర్వీకులు.. బ్యాంకులు, లేదా నాన్ బ్యాంకింగ్ సంస్థల్లో మర్చిపోయిన, మిగిలిపోయిన సొత్తు మీకు దక్కే ఛాన్స్‌ను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. కేంద్రం ఇటీవల ఈ డబ్బులు తీసుకునేందుకు సులువైన వెసులుబాటు కల్పించింది. సదరు నగదుకు మీరు హక్కుదారులు, వారసులైతే, బ్యాంకుల్లో నిరూపయోగంగా ఉన్న సొమ్ములు చాలా సులభంగా తీసుకుకొచ్చారు.
- Balaraju Goud
- Updated on: Dec 10, 2025
- 11:40 am
నిబంధనలు, చట్టాలు ప్రజల మేలు కోరకే.. వేధించడానికి కాదుః ప్రధాని మోదీ
మంగళవారం ఉదయం పార్లమెంట్ హౌస్‌లో NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ప్రధాని మోడీతో సహా NDA ఎంపీలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. బీహార్ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించినందుకు NDA నాయకులు ప్రధాని మోదీని సత్కరించారు. ఈ సమావేశంలో, ప్రధానమంత్రి పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి ప్రసంగించి అనేక అంశాలపై చర్చించారు.
- Balaraju Goud
- Updated on: Dec 9, 2025
- 6:07 pm
Parliament Winter Session 2025: లోక్‌సభలో వందేమాతరం గేయంపై ప్రత్యేక చర్చ ప్రారంభించిన ప్రధాని
వందేమాతర గీతం వరస మారుతున్నది. తరం మారుతున్నది..ఆ స్వరం మారుతున్నదీ అన్నాడో కవి. కానీ ఎవరెన్ని అపస్వరాలు పలుకుతున్నా.. తరాలుగా ఊరూవాడా ప్రతిధ్వనిస్తూనే ఉంది వందేమాతర గీతం. 150 వసంతాలు పూర్తిచేసుకున్న జాతీయ గీతంపై పార్లమెంట్ సాక్షిగా పదిగంటల ప్రత్యేక చర్చ జరుగుతుంది. ఆ డీటేల్స్ ఈ కథనంలో ...
- Ram Naramaneni
- Updated on: Dec 8, 2025
- 12:35 pm
గోంగూర, మామిడి పచ్చడి సహా.. పుతిన్ కోసం అధికారిక విందులో పసందైన వంటకాలు!
స్వాగతం మొదలు.. వీడ్కోలు వరకు ప్రతి ఫ్రేమ్ అదుర్స్. గ్రాండ్ వెల్కమ్.. రాష్ట్రపతి భవన్‌లో పసందైన విందు.. హైదరాబాద్ హౌస్‌లో దౌత్య చర్చలు.. ప్రతి ఫ్రేమ్‌లో పుతిన్ - మోదీ స్నేహబంధం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా మారాయి చర్చకు దారి తీశాయి. పుతిన్ పర్యటనతో భారత్ - రష్యా దౌత్య బంధం మరింత దృఢపడింది. రష్యా అధ్యక్షులు పుతిన్ 10 సార్లు భారతదేశాన్ని సందర్శించారు. ఇది ఆయన 11వ పర్యటన.
- Balaraju Goud
- Updated on: Dec 6, 2025
- 7:54 am
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ఎవరిపక్షం కాదు.. త్వరలో ప్రపంచశాంతిః ప్రధాని మోదీ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన రెండవ రోజుకు చేరుకుంది. శుక్రవారం (డిసెంబర్ 5)ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు గౌరవ వందనం లభించింది. ఆ తర్వాత ఆయన రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ హౌస్‌లో సమావేశమయ్యారు.
- Balaraju Goud
- Updated on: Dec 5, 2025
- 1:13 pm
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ
డిసెంబర్ 5న పుతిన్ అజెండాలో భాగంగా రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. పుతిన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా ఘన స్వాగతం పలికారు. ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. భారతదేశ ప్రపంచ దౌత్యంలో కీలక పాత్ర పోషించిన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా హాజరయ్యారు. ముందుగా రాజ్‌ఘాట్‌లో నివాళులు అర్పించిన పుతిన్, ప్రధాని మోదీతో ప్రతినిధి బృందం స్థాయి చర్చలకు హాజరయ్యారు.
- Balaraju Goud
- Updated on: Dec 5, 2025
- 12:04 pm
PM Modi – Putin: పుతిన్‌కు భగవద్గీత అందించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకత ఏంటో తెలుసా..?
రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం భగవద్గీత ప్రతిని బహుమతిగా ఇచ్చారు. అధ్యక్షుడు పుతిన్‌కు బహూకరించిన కాపీ రష్యన్ భాషలో ప్రచురించారు. ఈ సందర్భంగా ప్రధాని ట్వీట్ చేస్తూ.. గీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Dec 5, 2025
- 8:45 am
చిరుతల రాకతో భారతదేశం చరిత్రను తిరగరాసిందిః ప్రధాని నరేంద్ర మోదీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 4, గురువారం అంతర్జాతీయ చిరుత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో మధ్యప్రదేశ్ మూడు సంవత్సరాల క్రితం చిరుత ప్రాజెక్ట్ బహుమతిని అందుకుంది. సెప్టెంబర్ 17, 2022న తన పుట్టినరోజున ప్రధాన మోదీ కునో పాల్పూర్‌లో చిరుతలను విడుదల చేశారు.
- Balaraju Goud
- Updated on: Dec 4, 2025
- 10:08 am
PM Modi: వారి జీవితం స్ఫూర్తిదాయకం.. సేంద్రీయ వ్యవసాయం గురించి ప్రధాని మోదీ ఏమన్నారంటే..
సేంద్రీయ వ్యవసాయం ప్రాధాన్యం రోజురోజుకు పెరుగుతున్న ఈ సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక ముఖ్యమైన సందేశాన్ని దేశంతో పంచుకున్నారు. కోయంబత్తూరులో నవంబర్ 19న జరిగిన సౌత్ ఇండియా నేచురల్ ఫార్మింగ్ సమ్మిట్ 2025లో పాల్గొన్న ప్రధాని మోదీ.. అక్కడి అనుభవాన్ని సుధీర్ఘంగా లింక్‌డిన్ ఖాతాలో పోస్ట్ చేశారు. భారత వ్యవసాయం భవిష్యత్తు సేంద్రీయ వ్యవసాయంతోనే వెలుగొందుతుందని చెప్పారు.
- Shaik Madar Saheb
- Updated on: Dec 3, 2025
- 3:12 pm