AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించారు. జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్‌ను ఆయన ఫ్యాన్స్ పవన్ స్టార్, జనసేనానిగా పిలుచుకుంటారు. 1971 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో పవన్ జన్మించారు. అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల మక్కువ పెంచుకున్న పవన్.. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేట్రం చేశారు. తొలిప్రేమ, సుస్వాగతం, తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్ చిత్రాలు పవన్‌కు మంచి గుర్తింపు సాధించిపెట్టాయి. 27 ఏళ్ల సినీ ప్రస్థానంలో పవన్ సినిమాలు కలెక్షన్ల రికార్డులను తిరగరాసాయి. నిర్మాత, దర్శకుడిగానూ ప్రయత్నించారు. జపాన్ దర్శకుడు అకీరా కురసోవా స్ఫూర్తితో దర్శకుడుగా ‘జానీ’ చిత్రాన్ని రూపొందించారు. పవన్‌కు మార్షల్ ఆర్ట్స్‌లోనూ ప్రవేశం ఉంది.

2008లో తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం చేశారు. ప్రజా రాజ్యం పార్టీ యువజన విభాగానికి అధ్యక్షునిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత ఆ పార్టీని వీడిన పవన్.. 2014 మార్చిలో జనసేన పార్టీని స్థాపించారు. 2019లో 140 నియోజకవర్గాల నుంచి జనసేన పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నుంచి పోటీచేసి, రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి చెవిచూశారు. ఒక్క రాజోలు నియోజకవర్గంలో మాత్రమే జనసేన విజయం సాధించింది. 2024లో ఏపీలో జరిగే జమిలి ఎన్నికల్లో టీడీపీ – జనసేన మధ్య పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

సోషల్ మీడియాలోనూ పవన్ కళ్యాణ్‌కు విశేషమైన ఆదరణ ఉంది. ఇటీవల ఇన్‌స్టాగ్రమ్‌లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్‌కు ఒక్క పోస్ట్ చేయకుండానే లక్షల సంఖ్యలో ఫాలోవర్లు చేరారు. జనసేనాన్ని క్రేజ్ అలాంటిది మరి..!

ఇంకా చదవండి

లోక్‌సభ ముందుకు ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లు.. మద్దతు పలికిన కాంగ్రెస్, వైసీపీ వాకౌంట్!

అమరావతి చట్టబద్ధతకు మరో కీలక అడుగు పడింది. ఇవాళ బుధవారం (ఏప్రిల్ 01, 2026 ) ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని కేంద్రం ఆమోదించింది. ఆ తర్వాత లోక్‌సభ ముందుకు ఏపీ పునర్‌వ్యవస్థీకరణ సవరణ బిల్లు తీసుకువచ్చారు. అయితే లోక్‌సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.

Amaravati: అమరావతికి రాజముద్ర.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు.. లైవ్ వీడియో

పార్లమెంట్‌‌లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. లోక్‌సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ద్వారా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించనుంది కేంద్ర ప్రభుత్వం.. లోక్‌సభలో కేంద్రహోంశాఖ సహాయ మంద్రి నిత్యానంద రాయ్ బిల్లును ప్రవేశపెట్టారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతోంది. ఈ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది.

Pawan Kalyan: బరి’లోకి దిగిన పవర్‌స్టార్‌.. వైరల్‌ అవుతున్న బ్రో సినిమా సీక్వెల్‌ న్యూస్‌

పవన్ కళ్యాణ్ తన సినిమాల ప్రమోషన్లలో పాల్గొంటూ చూపిన అంకితభావం అద్భుతం. హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్‌ వంటి చిత్రాలకు పవర్‌స్టార్ కృషి చేశారు. ఆయన ప్రమేయం లేకున్నా బ్రో సీక్వెల్, బరి మూవీ లాంటి చర్చలతో ఆయన పేరు నిరంతరం వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్‌కు క్రేజ్ వెన్నంటే ఉంటుంది. ఇది ఆయనకు, సినీ ప్రపంచానికి మధ్య ఉన్న అద్భుతమైన బంధం.

Prakash Raj: ప్రకాష్ రాజ్ ఇంట విషాదం.. సంతాపం తెలిపిన పవన్ కళ్యాణ్

సినీ  నటుడు ప్రకాష్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ప్రకాష్ రాజ్ తల్లి శ్రీమతి సువర్ణలత  కన్నుమూశారు. ఈరోజు సాయంత్రం బెంగుళూరులో ఆమె అంత్య క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా ఆమె వయోభారం సమస్యలతో బాధపడుతున్నారు .

Ustaad Bhagat Singh: అప్పుడే ఓటీటీలోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’! ఆ రోజు నుంచే పవన్ కల్యాణ్ సినిమా స్ట్రీమింగ్ !

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఉగాది కానుకగా మార్చి 19న విడుదలైన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. పవన్ కల్యాణ్ అభిమానులకు ఈ మూవీ పిచ్చి పిచ్చిగా నచ్చినా కామన్ ఆడియెన్స్ కు మాత్రం పెద్దగా ఎక్కలేదు.

పెద్దికి ప్రమాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ట్వీట్!

పెద్ది షూటింగ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు స్వల్ప గాయమైంది. హైదరాబాద్ లో కీలకమైన యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చరణ్ రెండు రోజుల విశ్రాంతి అనంతరం తిరిగి షూటింగ్ లో పాల్గొంటారని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.

మహేష్, పవన్ సినిమాలకు నో చెప్పిన స్టార్ నటుడు.. బ్రతికినంత కాలం హీరోగానే

సినిమా ఇండస్ట్రీలో ఆయన ఓ తోప్ హీరో.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఫ్యామిలీ ఆడియన్స్ లో ముఖ్యంగా లేడీస్ లో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు ఆ స్టార్ హీరో. కానీ ఆయన బ్రతికినంత కాలం హీరోగానే ఉన్నారు.

Pawan Kalyan: ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.. ఫస్ట్ పోస్ట్ ఏంటో చూశారా?

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా చాలా రిజర్వ్ డ్ గా ఉంటారు. మరీ ముఖ్యమైన ఫంక్షన్లు, ఈవెంట్స్ ఉంటే తప్ప ఆమె పెద్దగా బయటకు రారు. ఇక కాసేపటి క్రితం వరకు ఆమెకు ఎలాంటి అధికారిక సోషల్ మీడియా ఖాతాలు కూడా లేవు.

Ram Charan : పెద్ది షూటింగ్‏లో ప్రమాదం.. రామ్ చరణ్‏కు గాయాలు.. స్పందించిన పవన్ కళ్యాణ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణల సమయంలో చరణ్ కంటి సమీపంలో స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో పెద్ది చిత్రీకరణకు బ్రేక్ పడింది. చరణ్ కు చిన్న గాయమేనని.. దీనిపై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్రయూనిట్ స్పష్టం చేసింది. తాజాగా ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందించారు.

Ustaad Bhagat Singh: ఫిల్మ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఉస్తాద్ టికెట్‌ రేట్ల పై బంపర్ ఆఫర్

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా టికెట్ ధరలు మార్చి 23 నుండి ఏపీలో తగ్గాయి. తొలి 10 రోజుల పెరిగిన ధరల అనుమతి తొలగించి, ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ₹100, మల్టీప్లెక్స్‌లు ₹125. ఈ తగ్గింపుతో ఎక్కువ మంది ఆడియన్స్ థియేటర్లకు వచ్చి, కలెక్షన్లు పెరుగుతాయని మైత్రీ మూవీ మేకర్స్ ఆశిస్తున్నారు.

  • Phani CH
  • Updated on: Mar 24, 2026
  • 8:05 pm

Rajamouli: రాజమౌళికి బాగా ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? యూత్‌లో ఉన్నప్పుడు అతని కోసం ఏకంగా చొక్కాలు చించుకుని మరీ..

దేశం గర్వించదగ్గ దర్శకుల్లో దర్శక ధీరుడు రాజమౌళి ఒకరు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మరి అలాంటి ది గ్రేట్ రాజమౌళికి బాగా ఇష్టమైన హీరో ఒకరున్నాడట. యూత్ లో ఉన్నప్పుడు అతని సినిమాలు చూసేందుకు చొక్కాలు కూడా చించుకున్నారట.

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? క్లారిటీ ఇచ్చేసిన టీమ్.. ‘ఓజీ 2’ కూడా..

ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఇటీవలే 'ఉస్తాద్ భగత్ సింగ్' గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లు రాబడుతోంది.