AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్

ప్రభాస్

రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా స్టార్‌గా ప్రస్తుతం సత్తా చాటుతున్నాడు. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ప్రభాస్ కెరియర్ మారిపోయిందని చెప్పవచ్చు. అప్పటి వరకు మాస్ హీరోగా ఉన్న ప్రభాస్.. బాహుబలి మూవీతో పాన్ ఇండియా హీరో అయిపోయారు. ఆదిపురుష్ మూవీతో హీరోగా తనకున్న ఇమేజ్‌ను 360 డిగ్రీలు మార్చుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు రెబల్ స్టార్ మూవీస్ బిజినెస్ రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లకు చేరుకుందంటే ప్రభాస్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అభిమానులు ప్రభాస్‌ను డార్లింగ్‌గా పిలుచుకుంటారు.

1979 అక్టోబర్ 23న మద్రాసులో జన్మించారు ప్రభాస్. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు వారి కుటుంబ స్వగ్రామం. తన తల్లితండ్రులకు ఉన్న సంతానంలో రెండోవాడు ప్రభాస్. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. 2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్ర, అడవి రాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు సినిమాలు టాలీవుడ్‌లో యంగ్ రెబల్ స్టార్ రేంజ్‌ను పెంచేశాయి. బిల్లా, ఏక్ నిరంజన్, డార్టింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, రెబెల్, మిర్చి మూవీస్‌తో టాలీవుడ్‌లో టాప్ యంగ్ హీరోస్ సరసన నిలిచాడు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. డిసెంబరు 22న రిలీజ్ కానున్న సాలార్‌తో పాటు ప్రాజెక్ట్ కె, స్పిరిట్ పాన్ ఇండియా మూవీస్‌పై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి.

కృష్ణంరాజుకు ప్రసీదీ, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తేలు. దీంతో కృష్ణంరాజు సోదరుడు సూర్యనారాయణ రాజు కుమారుడైన ప్రభాస్.. కృష్ణంరాజు నటవారసుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్ అవడానికి సోదరుడి కుమారుడే అయినా.. వీరిద్దరి మధ్య తండ్రీ కొడుకుల అనుబంధమే కొనసాగేది. అంతగా తన నట వారసుడి గురించి కృష్ణంరాజు.. గర్వపడేవారు. ప్రభాస్, కృష్ణంరాజు కలసి రెబల్ సినిమాలో కూడా యాక్ట్ చేశారు. ఇందులో తండ్రీకొడుకులుగా వారు నటించారు. నిజజీవితంలో కృష్ణంరాజు ప్రభాస్ కు పెదనాన్న కాగా.. ఈ చిత్రంలో మాత్రం.. ఇద్దరూ తండ్రీకొడుకుల్లా చేసిన నటన రెబల్ ఫ్యామిలీ ఫ్యాన్స్ కి ఒక విజువల్ ఫీస్ట్‌గా నిలిచింది. ఒకానొక సమయంలో ప్రభాస్ అల్టిమేట్ యాక్టింగ్ స్కిల్స్ తో హాలీవుడ్ రేంజ్ కి చేరారని స్వయానా కృష్ణంరాజు ఎంతో గర్వంగా చెప్పుకున్నారు.

ఇంకా చదవండి

ఎప్పుడు నవ్వుతూ కూల్ గా ఉండే ప్రభాస్ కూడా ఆరోజు బాధపడ్డాడు.. డార్లింగ్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన వినాయక్

ఒకప్పుడు టాలీవుడ్ లో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు వీవీ వినాయక్. చిరంజీవి, బాలయ్య, వెంకీ తదిరత స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్స్ తీశారు. అయితే ప్రస్తుతం ఆయన సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. మరోవైపు ఆయన కమ్ బ్యాక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Prabhas: ఆ ఒక్క విషయంలో ప్రభాస్‌కు తలనొప్పులు..

ప్రభాస్ ఒకేసారి ఒక సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నా, ప్రస్తుత కమిట్‌మెంట్‌ల వల్ల అది సాధ్యం కావట్లేదు. 'ఫౌజీ', 'కల్కి 2', 'స్పిరిట్' వంటి భారీ చిత్రాలను ఏకకాలంలో బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఒకేసారి మూడు విభిన్న లుక్స్, పాత్రలను పోషిస్తూ షెడ్యూల్స్‌ను మేనేజ్ చేయడం ప్రభాస్‌కు పెద్ద సవాలుగా మారింది. ఈ పరిస్థితి డార్లింగ్ ప్రణాళికలను ప్రభావితం చేస్తోంది.

Prabhas : అదిదా సర్ ప్రైజ్.. ఆ హీరోయిన్ సినిమాలో ప్రభాస్ స్పెషల్ రోల్.. ఊహించని పాత్రలో..

పాన్ ఇండియా స్టా్ర్ హీరో ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు వరుస సినిమాలతో క్షణంతో గడుపుతున్న డార్లింగ్.. మరోవైపు పలు సినిమా ప్రమోషనల్లో పాల్గొంటున్నాడు. అలాగే కొన్ని చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. ఇదివరకే కన్నప్ప చిత్రంలో రుద్ర పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. తాజాగా మరో హీరోయన్ సినిమాలో నటిస్తున్నారని టాక్.

Prabhas: డోంట్ కేర్.. నేను ఫుల్ క్లారిటీ తో ఉన్న అంటున్న డార్లింగ్

డార్లింగ్ ప్రభాస్ తన అప్‌కమింగ్ సినిమాల విషయంలో ఎవరి షరతులు వినడం లేదని స్పష్టమైంది. సందీప్ వంగా 'స్పిరిట్' కోసం అడిగిన బల్క్ డేట్స్, ఎక్స్‌క్లూజివిటీని ప్రభాస్ పక్కన పెట్టారు. ప్రస్తుతం 'కల్కి 2898 AD' షూటింగ్‌తో పాటు 'స్పిరిట్'కు కూడా డేట్స్ అడ్జస్ట్ చేస్తూ, మూడు సినిమాలను సమాంతరంగా పూర్తి చేస్తున్నారు. ప్రభాస్ తన పాత వర్కింగ్ స్టైల్‌నే కొనసాగిస్తున్నారు.

Maruthi: ఈసారి మెగా హీరోతో మారుతి సినిమా.. కథ కూడా రెడీ అవుతుందట

రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మారుతి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. దాంతో మారుతి నెక్ట్స్ ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే మారుతి మెగా హీరోతో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది.

Prabhas: డార్లింగ్ సినిమాలపై హీరోయిన్‌ల హోప్స్

"ది రాజా సాబ్" సినిమా నిరాశపరిచినప్పటికీ, ప్రభాస్ రాబోయే చిత్రాలపై పలువురు నాయికలు ఆశలు పెట్టుకున్నారు. "స్పిరిట్" తో త్రిప్తి డిమ్రి, "ఫౌజీ" తో ఇమాన్వి, అలాగే "కల్కి" సీక్వెల్ హీరోయిన్‌లు తమ కెరీర్ కు ఈ సినిమాలు కీలకం భావిస్తున్నారు. దర్శకుల పనితీరు, ఫ్రెష్ జోడీ వంటి అంశాలు ఈ అంచనాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.

Actress Raasi: ఆ స్టార్ హీరో అంటే చెప్పలేనంత ఇష్టం.. అతని సినిమాలు చూడడానికి మాత్రమే థియేటర్లకు వెళతా

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది రాశి. టాలీవుడ్ లోని దాదాపు స్టార్ హీరోలందరితోనూ ఆమె సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చేస్తోన్న ఆమె టాలీవుడ్ కు చెందిన ఓ హీరో గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Mumaith Khan: ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు.. ఇప్పుడు అతను నా బెస్ట్ ఫ్రెండ్

ఒకప్పుడు స్పెషల్ సాంగ్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు ముమైత్ ఖాన్. ఎన్నో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో స్టెప్పులేసి ఆకట్టుకుంది ఈ అందాల తార. అలాగే కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లోనూ నటించింది. ప్రస్తుతం ముమైత్ సినిమాల స్పీడ్ తగ్గించింది.

Prabhas : ప్రభాస్ మరదలిగా, ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. క్రేజ్ చూస్తే మెంటలే..

ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. స్టార్ హీరోహీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం ఓ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? సినీరంగంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న ముద్దుగుమ్మ.

Prabhas: ప్రభాస్‌ 2.0.. నయా స్టైల్‌ చూస్తే ఫ్యాన్స్ కు దిమ్మ తిరగాల్సిందే

"ది రాజాసాబ్" వైఫల్యం తర్వాత ప్రభాస్ తన కెరీర్‌పై పునరాలోచన చేస్తున్నారు. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు నిరాశపరచడంతో, రాబోయే ప్రాజెక్టుల కోసం కొత్త ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నారు. లుక్, కథల ఎంపికలో మార్పులతో ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ రెండింటిలోనూ ప్రభాస్ 2.ఓను అభిమానులు చూడబోతున్నారు. ఈ నూతన వ్యూహం విజయవంతమవుతుందో లేదో చూడాలి.

  • Phani CH
  • Updated on: Mar 17, 2026
  • 5:35 pm

దూకుడు మీదున్న డార్లింగ్‌.. తగ్గేదేలే అంటున్న బన్నీ!

పాన్ ఇండియా స్టార్స్ అల్లు అర్జున్, ప్రభాస్ మాలీవుడ్ పై దృష్టి సారించారు. అల్లు అర్జున్ క్రాస్ ఓవర్ కాంబోస్‌కు ప్రాధాన్యత ఇస్తుండగా, ప్రభాస్ కూడా మలయాళ దర్శకులతో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరిద్దరి మధ్య మల్లు ఇండస్ట్రీ ప్రాజెక్టుల విషయంలో పోటీ పెరుగుతోంది.

స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ !

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాపై ఆసక్తికరమైన అప్‌డేట్స్ వచ్చాయి. ఈ చిత్రం కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదని, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ప్రభాస్ అభిమానులను ఆకట్టుకునే మాస్ అంశాలు, పంచ్ డైలాగులు పుష్కలంగా ఉంటాయని మేకర్స్ వెల్లడించారు. షూటింగ్ బ్రేక్ ఉన్నా, నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.