జూనియర్ ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలరామాయణం సినిమాలో నటించి మెప్పించాడు. అంతకు ముందు బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో నటించాడు. 2001లో వచ్చిన నిన్ను చూడాలని సినిమాతో హీరోగా మారాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అదే ఏడాది వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్టీఆర్ కు మంచి హిట్ ఇచ్చింది. అదే ఏడాది సుబ్బు అనే సినిమా చేశాడు. ఈ సినిమా నిరాశపరిచింది. ఆ వెంటనే వచ్చిన ఆది సినిమా భారీ విజయాన్నిఅందుకుంది. ఇలా ఒకే ఏడాది లో నాలుగు సినిమాలు చేసి రెండు భారీ విజయాలను అందుకున్నాడు ఎన్టీఆర్.
ఇక ఎన్టీఆర్ డాన్స్ కు , యాక్టింగ్ కు, డైలాగ్ డెలివరీకి ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు . దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం గా తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించాడు తారక్. ఇక ఇప్పుడు దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకురానుంది.
Tollywood : ఆ కారణంతోనే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో నటించట్లేదు.. అసలు విషయం చెప్పిన స్టార్ హీరో..
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో డ్రాగన్ (ప్రచారంలో ఉన్న పేరు) ఒకటి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు ఓ స్టార్ హీరో.
- Rajitha Chanti
- Updated on: Mar 31, 2026
- 8:09 pm
Aadi Movie: ఆది సినిమాలో ఎన్టీఆర్ జోడిగా ఆ హీరోయిన్ చేయాల్సింది.. తనని వెళ్లి అడిగితే ఏం జరిగిందంటే.. డైరెక్టర్ వివి వినాయక్..
దర్శకుడు వి.వి. వినాయక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో భారీ విజయాలను అందుకున్నారు. స్టార్ హీరోలతో విభిన్నమైన కంటెంట్ చిత్రాలను తెరకెక్కించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆది సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆది సినిమా నిర్మాణ విశేషాలను పంచుకున్నారు. సాఫ్ట్ సినిమాల నుంచి మాస్ జోనర్‌లోకి తన ప్రయాణం, ఆది సినిమాకు దారితీసిన పరిస్థితులను వివరించారు.
- Rajitha Chanti
- Updated on: Mar 26, 2026
- 4:52 pm
అప్పట్లో రికార్డ్ క్రియేట్ చేసిన అదుర్స్ మూవీ.. సీక్వెల్ ఎప్పుడంటే?
ఎన్టీఆర్ నటించిన బ్లాక్‌బస్టర్ అదుర్స్ సీక్వెల్‌పై దర్శకుడు వీవీ వినాయక్ స్పష్టతనిచ్చారు. అదుర్స్ ఒక భావోద్వేగ చిత్రమని, దాని కథ అక్కడితో ముగిసిందని ఆయన పేర్కొన్నారు. బలవంతంగా సీక్వెల్ చేస్తే మొదటి భాగం మ్యాజిక్ ఉండదని, అందుకే ఆ ప్రయత్నం చేయట్లేదని వినాయక్ తేల్చి చెప్పారు. ఈ చిత్రానికి సీక్వెల్ ఉండదని స్పష్టమైంది.
- Samatha J
- Updated on: Mar 26, 2026
- 2:01 pm
అన్న బాడీ బాక్సాఫీస్ రా..! ఏడు వారాల్లో పది కేజీలు.. డ్రాగన్ కోసం ఎన్టీఆర్ లుక్
పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరోయిన్ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుంది.
- Rajeev Rayala
- Updated on: Mar 23, 2026
- 8:59 am
Dhurandhar 2 : ‘ధురందర్’ డైరెక్టర్ నెక్ట్స్ సినిమా ఇదే! ఆ టాలీవుడ్ స్టార్ హీరోలతో భారీ మల్టీస్టారర్ మూవీ!
రణవీర్ సింగ్ హీరోగా నటించిన 'ధురందర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఈ చిత్రం హిందీలోనే కాకుండా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నూ భారీ కలెక్షన్లు రాబడుతోంది. దీంతో డైరెక్టర్ ఆదిత్య ధర్ పేరు మరోసారి మార్మోగుతోంది.
- Basha Shek
- Updated on: Mar 23, 2026
- 6:57 am
మహేష్ కాకుండా ఇప్పటి హీరోల్లో అతనంటేనే ఇష్టం.. కృష్ణ చెప్పిన పేరు వింటే పూనకాలే
తెలుగు సినిమా చరిత్రలో చెరిగిపోని స్థానం సంపాదించుకున్న నటుల్లో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. తెలుగు సినిమాల్లో ఆయన ఓ శిఖరం.. ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీని షేక్ చేశారు కృష్ణ. బుర్రిపాలే అనే గ్రామం నుంచి వచ్చిన కృష్ణ రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్నారు.
- Rajeev Rayala
- Updated on: Mar 22, 2026
- 11:20 am
V. V. Vinayak: రెండు రోజుల్లో స్టోరీ రాసా..! కట్ చేస్తే సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది..
ఒకప్పుడు వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోయారు వివి వినాయక్. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న వివివినాయక్ ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గించారు. చివరిగా ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేశారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
- Rajeev Rayala
- Updated on: Mar 20, 2026
- 11:11 pm
Suddala Ashok Teja: నేను పాట రాస్తే ఆ హీరో ప్రాణం పెట్టాడు.. ఆయన నటన అద్భుతం.. ఇప్పటికీ ఆ సాంగ్.. సుద్ధాల అశోక్ తేజ..
జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి రచయిత సుద్దాల అశోక్ తేజ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తారక్ నటన గొప్పతనంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. తాను రాసిన ఒక పాటలో ఎన్టీఆర్ నటన ఆశ్చర్యం కలిగించిందని.. పాత్రలో ఒదిగిపోయిన తీరు చూసి షాకయ్యానని అన్నారు.
- Rajitha Chanti
- Updated on: Mar 20, 2026
- 1:54 pm
నా శరీరం గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు.. ఎన్టీఆర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
సోషల్ మీడియాలో సినీతారలపై వ్యక్తిగత జీవితాల గురించి ఏదోక న్యూస్ వైరలవుతుంటుంది. లవ్, బ్రేకప్, పెళ్లి గురించి పలు విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. ఇక కొన్నిసార్లు స్టార్స్ లుక్స్, ఫిట్నెస్ పై అనేక విమర్శలు వస్తుంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ట్రోల్స్ ఎక్కువగా వస్తుంటాయి.
- Rajeev Rayala
- Updated on: Mar 13, 2026
- 11:50 am
Jr NTR: అప్పట్లో మా తాత.. ఇప్పుడు నేను.. చాలా సంతోషంగా ఉంది
జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరులో కిమ్స్ హాస్పిటల్ ప్రారంభించారు. కర్ణాటకకు రావడం అమ్మమ్మ ఇంటికి వచ్చినట్టుంటుందని, కిమ్స్ హాస్పిటల్ తన కుటుంబ సభ్యుల లాంటిదని తెలిపారు. తన తాత ఎన్టీఆర్ 1983లో శంకుస్థాపన చేసిన చోటే తాను ప్రారంభించడం పూర్వజన్మ సుకృతమన్నారు. భాస్కర్, గురువారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
- Phani CH
- Updated on: Mar 11, 2026
- 1:16 pm
Jr NTR: ఎన్టీఆర్ న్యూ లుక్ రివీల్ !! తారక్ మేకోవర్‌కు ఫ్యాన్స్ ఫిదా
కొన్నాళ్లుగా బయటికి రాని జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కోసం సిద్ధమైన తన న్యూ లుక్‌తో అభిమానుల ముందుకు వచ్చారు. జిమ్‌లో చెమటోడ్చి సాధించిన ఈ స్టైలిష్ మేకోవర్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్న తారక్, తర్వాత దేవర 2పై దృష్టి సారించనున్నారు. ఆయన మేకోవర్‌కు భారీ స్పందన లభించింది.
- Phani CH
- Updated on: Mar 10, 2026
- 5:13 pm
విజయ్-రష్మికల రిసెప్షన్‌లో ఎన్టీఆర్ డూప్‌ను బన్నీ బౌన్సర్లు నెట్టేశారా? వీడియో రిలీజ్ చేసిన ఈశ్వర్
విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నాల వెడ్డింగ్ రిసెప్షన్ కు అతిరథ మహారథులు తరలివచ్చారు. సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు వచ్చి కొత్త దంపతులను ఆశీర్వదించారు. అలా ఈ విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు ఎన్టీఆర్ డూప్ ఈశ్వర్ కూడా హాజరయ్యాడు. కానీ..
- Basha Shek
- Updated on: Mar 10, 2026
- 7:53 am