వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత. ధివంగత ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడైన వైఎస్ జగన్.. నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రి. వైఎస్ జగన్ 1972 డిసెంబర్ 21న కడప జిల్లా పులివెందులలో జన్మించారు. ఆయన బీ.కామ్, ఎంబీఏ చదువుకున్నారు. 1996లో భారతిని జగన్ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పారిశ్రామిక వేత్తగా కెరీర్ ప్రారంభించిన జగన్.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై కడప ఎంపీగా గెలిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో జగన్ సాధించిన తొలి విజయం ఇదే. అదే సంవత్సరం హెలికాప్టర్ ప్రమాదంలో తండ్రి వైఎస్సార్ మరణించడంతో జగన్ జీవితంలో పెను కుదుపు ఏర్పడింది. వైఎస్సార్ మరణం తర్వాత ఓదార్పు యాత్ర ద్వారా ప్రజలకు జగన్ దగ్గరయ్యారు. వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఓదార్పు యాత్ర ద్వారా పరామర్శించారు.

కాంగ్రెస్ పార్టీతో విబేధాల కారణంగా.. 2010లో తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన జగన్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరిట కొత్త పార్టీని ప్రారంభించారు. 2011లో కడప లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గెలిచారు. తండ్రి పరపతిని వాడుకుని అక్రమాస్తులు కూడబెట్టుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ చేత అరెస్టైన జగన్.. 16 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన జగన్.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకునేందుకు 2017లో ప్రజాసంకల్ప యాత్రను చేపట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో 151 స్థానాల్లో గెలిచి ఏపీ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నారు.

ఇంకా చదవండి

YCP Manifesto: వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదల.. చేసేది స్పష్టంగా ప్రజలకు చెప్పే అజెండాతో మేనిఫెస్టోః జగన్

వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టోను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని YSRCP కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 99 శాతం దాకా అమలు చేయడం జరిగిందన్నారు జగన్.

YCP Manifesto: నవరత్నాల ప్లస్ పేరుతో మేనిఫెస్టో.. వారికి రుణాలపై వడ్డీ మాఫీ!

సుదీర్ఘ కసరత్తు తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో రెడీ అయింది. దూరమైన వర్గాలకు దగ్గరయ్యేలా మేనిఫెస్టో రూపకల్పన చేశారు. వైసీపీ మేనిఫెస్టోను మరికొద్ది గంటల్లో తాడేపల్లి వేదికగా సీఎం జగన్ విడుదల చేస్తారు. మేనిఫెస్టోలో ఏఏ అంశాలు ఉండబోతున్నాయనే ఉత్కంఠ నెలకొంది.

AP News: బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..

ఎప్పుడు గంభీరంగా కనిపించే మంత్రి బొత్స సడన్‎గా చిన్నపిల్లాడిలా మారిపోయారు. భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. అది కూడా నాలుగు గోడల మధ్య కాదు.. వేలాది మంది ప్రజలు చూస్తున్న సమయంలోనే తన కంటి నుంచి నీరు కార్చారు. ఆయన కళ్ల నుండి వచ్చిన కన్నీరును చూసిన కార్యకర్తలు సైతం తమ అభిమానాన్ని ఆపుకోలేక కంటతడిపెట్టుకున్నారు.

YSRCP: పార్టీ ముఖ్య నేతలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం.. మేనిఫెస్టోపై కసరత్తు.. విడుదల ఎప్పుడంటే..

ఏపీలో సీఎం జగన్ మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టారు. పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో జోరుమీద ఉన్నాయి. అయితే జగన్ ఇప్పటికే మేమంతా సిద్దం అంటూ దాదాపు 22 రోజుల పాటు దాదాపు 60కి పైగా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముగించారు. మరో జైత్రయాత్రకు సిద్దమవుతున్న తరుణంలో మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టారు. ఏప్రిల్ 27, శనివారం ఉదయం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

  • Srikar T
  • Updated on: Apr 26, 2024
  • 2:53 pm

సీఎం జగన్ జైత్రయాత్రకు సర్వం సిద్దం.. అప్పటి నుంచే మలివిడత ఎన్నికల ప్రచారం..

సీఎం జగన్ మలివిడత ఎన్నికల ప్రచారానికి రంగం సిద్దం చేసింది వైసీపీ. రాష్ట్ర వ్యాప్తంగా 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రూట్ మ్యాప్ రూపొందించారు వైసీపీ నాయకులు. ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికర పరిణామాలతో కొత్త రంగు పులుముకుంటోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తనదైన పక్కా ప్రణాళికలతో సిద్దం, మేమంతా సిద్దం అంటూ రెండు రకాల ప్రచార యాత్రలు చేపట్టి ప్రజల్లో మమేకం అయ్యారు.

  • Srikar T
  • Updated on: Apr 25, 2024
  • 8:48 pm

ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్ నేత..

కడపలో టీడీపీకి మరో షాక్ తగిలింది. తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో కూటమిలో సీట్ల సర్థుబాటులో భంగపడ్డ నేతలందరూ టీడీపీ, జనసేనను వీడి సీఎం జగన్ పార్టీలో చేరారు. మేమంతా సిద్దం బస్సు యాత్రలో దాదాపు 220పై చిలుకు నాయకులు కూటమి పార్టీల నుంచి వైసీపీలోకి చేరారు.

  • Srikar T
  • Updated on: Apr 25, 2024
  • 4:32 pm

Watch Video: తిరుపతిలో నామినేషన్ వేసిన చంద్రగిరి వైసీపీ అభ్యర్థి.. పాల్గొన్న ముఖ్య నేతలు..

తిరుపతి జిల్లా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. మోహిత్‌రెడ్డి నామినేషన్‌ సందర్భంగా చంద్రగిరిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీ రెడ్డప్ప, భూమన కరుణాకర్‌రెడ్డితోపాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి నామినేషన్‌ ర్యాలీకి వైసీపీ కార్యకర్తలు పెద్దయెత్తున తరలిరావడంతో చంద్రగిరి పట్టణం కిక్కిరిసిపోయింది.

  • Srikar T
  • Updated on: Apr 25, 2024
  • 3:51 pm

YS Jagan: తగ్గేదేలే.. మరో జైత్రయాత్రకు సీఎం జగన్‌ సిద్ధం.. 15 రోజులు నాన్‌స్టాప్ ప్రచారం..

వై నాట్ 175 అసెంబ్లీ.. 25 ఎంపీ సీట్స్.. టార్గెట్‌గా వైఎస్ఆర్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే మేమంతా సిద్ధం బస్సు యాత్రతో వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపారు. మార్చి 27న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన యాత్ర.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది.

YS Jagan: పులివెందుల అంటే నమ్మకం.. ధైర్యం.. నా ప్రాణం.. వివేకాను ఎవరు చంపించారో ప్రజలకు తెలుసు

వివేకాను చంపిన హంతకుడికి ఎవరు మద్దతు ఇస్తున్నారో మీరంతా చూస్తున్నారు.. వివేకాను ఓడించిన వారితోనే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటే అర్థమేంటి..? అంటూ జగన్ ప్రశ్నించారు. చిన్నాన్నకు రెండో పెళ్లి అయింది వాస్తవం.. సంతానం ఉన్నది వాస్తవం.. చిన్నాన్నను ఓడించిన వారిని గెలిపించమనడం కంటే దిగజారుడు ఏముంటుందంటూ.. జగన్ పేర్కొన్నారు.

AP Election: ఇవాళ్టితో ముగియనున్న ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. ఎన్నికల్లో పోటీకి యువత ఎక్కువగా మొగ్గుచూపుతుండటంతో ఈ సారి నామినేషన్లు భారీగా దాఖలు అవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే ఎంపీ స్థానాలకు 203మంది, అసెంబ్లీ స్థానాలకు 1వెయ్యి,123 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

YSRCP: మేమంతా సిద్దం బస్సుయాత్ర జోష్ కొనసాగింపు.. రానున్న రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..

సిద్ధం సభలతో ఏపీలో క్యాడర్‌కు ఒక హై ఇచ్చిన సీఎం జగన్‌.. మేమంతా సిద్ధం యాత్రతో.. పీక్‌లోకి తీసుకెళ్లారు. 22 రోజులపాటు సాగిన బస్సుయాత్రతో ప్రజలతో మమేకం అవుతూ ముందుకెళ్లారు. ప్రజలను కలుస్తూ.. వారి సమస్యలు వింటూ.. పరిష్కారాలు చూపిస్తూ.. కష్టాల్లో ఉన్నవారికి భరోసా ఇస్తూ ముందుకు సాగారు జగన్‌. జెండాలు జతకట్టడమే ప్రత్యర్థుల ఎజెండా అంటూ ప్రసంగాలతో జోష్‌ నింపిన సీఎం జగన్‌ అసలు ఎజెండా ఏంటి? ఆయన ఈ యాత్రతో అటు కేడర్‌కు ఇటు ప్రజలకు ఏం సందేశం ఇచ్చారు?

  • Srikar T
  • Updated on: Apr 24, 2024
  • 9:27 pm

YSRCP: సీఎం జగన్ ‘మేమంతా సిద్దం’ బస్సుయాత్ర సక్సెస్.. కడప నుంచి శ్రీకాకుళం వరకు ఎలా సాగిందంటే..

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ షెడ్యూల్ ప్రకారం బుధవారం జరిగిన సభతో మేమంతా సిద్దం బస్సుయాత్ర ముగిసింది. సిక్కోలు సింహాల్లా సభకు భారీ ఎత్తున తరలివచ్చారు ప్రజలు. పెత్తందారుల ముఠాపై యుద్ధానికి సిద్ధం అంటూ సీఎం జగన్ కార్యకర్తల్లో జోష్ నింపారు. డబుల్‌ సెంచరీ కొట్టేందుకు సిద్ధమా అని ప్రజలను అడిగారు. ఇవి పేదల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు అన్నారు ఆయన.

  • Srikar T
  • Updated on: Apr 24, 2024
  • 7:18 pm

‘ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతుంది’.. సజ్జల రామకృష్ణా రెడ్డి కామెంట్స్..

వైసీపీ అధికారంలోకి రాబోతుందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో ఇదే కూటమి జతకట్టిందని గుర్తు చేశారు. కాపు సామాజిక వర్గం ఓట్లను గంపగుత్తగా చంద్రబాబుకు వేయించాలని పవన్ కళ్యాణ్ విశ్వప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబు కోసమే పవన్ తాపత్రయపడుతున్నారని చురకలంటించారు.

  • Srikar T
  • Updated on: Apr 24, 2024
  • 4:49 pm

YS Jagan: క్లైమాక్స్‌కి మేమంతా సిద్ధం బస్సుయాత్ర.. పులివెందులలో నామినేషన్‌ వేయనున్న సీఎం జగన్..

వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. రణస్ధలం ఎంపీటీసీ మజ్జి గౌరి, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రమేష్, రణస్ధలం మండలం మాజీ ఎంపీపీ గొర్లి విజయకుమార్, సీనియర్ నేత రామారావు వైసీపీలో చేరారు. సీఎం జగన్‌ బస్సుయాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది.

KCR: ‘ఏపీలో మళ్లీ జగనే’.. కేసీఆర్ కీలక కామెంట్స్

ఏపీలో రాజకీయాల్లో ఏం జరిగినా తమకు పట్టింపు ఏమీ లేదన్నారు మాజీ సీఎం కేసీఆర్. మళ్లీ జగనే గెలిచే అవకాశం ఉందని తమకు సమాచారం ఉందన్నారు. ఒక రాజకీయ నాయకుడిగా అక్కడ..  ఎవరో ఒకరికి వత్తాసు పలకడం కరెక్ట్ కాదన్నారు కేసీఆర్.  ఆయనేమన్నారో వీడియోలో చూడండి...