లోక్‌సభ ఎన్నికలు 2024

లోక్‌సభ ఎన్నికలు 2024

2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత 17వ లోక్‌సభ పదవీకాలం 16 జూన్ 2024తో యుగియనుంది. జూన్ 16లోపు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. 2019లో 17వ లోక్‌సభకు ఏప్రిల్, మే నెలల్లో ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 2019 ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు ఏడు విడతల్లో ఓటింగ్ నిర్వహించి.. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టారు. దాదాపు 91.2 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 67 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాటి ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. బీజేపీకి 37.36 శాతం, కాంగ్రెస్‌కు 19.49 శాతం ఓట్లు దక్కాయి.

దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉండగా, మెజారిటీకి 272 సీట్లు అవసరం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 83 ప్రకారం, ప్రతి ఐదేళ్లకు ఒకసారి లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయి. 18వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) త్వరలోనే ప్రకటించనుంది. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ 30కి పైగా పార్టీలతో పొత్తు పెట్టుకోగా, కాంగ్రెస్ తదితర విపక్షాలు ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేశాయి.

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తారు. ఈ సారి కూడా ఏప్రిల్, మే నెలల్లో ఆరు నుంచి ఏడు విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశముంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలు, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా యూపీలో 80 లోక్‌సభ స్థానాలు, మహారాష్ట్రలో 48, పశ్చిమ బెంగాల్‌లో 42, బీహార్ 42, తమిళనాడు 39 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలుపొంది వరుసగా మూడోసారి అధికార పగ్గాలు సొంతం చేసుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.

ఇంకా చదవండి

Lok Sabha Elections 2024: మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..

ఇప్పటికే 2 విడతల పోలింగ్ ముగించుకున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో.. మూడో పోలింగ్ కోసం ఏర్పాటు చకచకా సాగుతున్నాయి. మంగళవారం (మే 7న) 13 రాష్ట్రాల్లో 94 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, అస్సాం, గుజరాత్, పశ్చిమ బెంగాల్ సహా మొత్తం 13 రాష్ట్రాలున్నాయి. భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్‌ నేతృత్వంలోని I.N.D.I.A కూటమి మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది.

Watch Video: ‘ఇది తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక’.. మాజీ మంత్రి హరీష్ రావు..

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‎ను మరికొన్ని సంవత్సరాలు కొనసాగించేందుకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావు. కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జరిగే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినవన్నారు. ఏన్నో ఏళ్లుగా ఢిల్లీలో పోరాడి, కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని గతాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ మాదని, దీనిని మరికొన్ని రోజులు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారన్నారు.

  • Srikar T
  • Updated on: May 3, 2024
  • 8:29 pm

Telangana: బీజేపీ అభ్యర్థిని భయపెడుతున్న ఓటింగ్ మెషీన్.. అసలు విషయం తెలిస్తే షాక్..

చేవెళ్ళ బీజేపీ ఎంపీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. 5 అంకె ఆయనికి ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. నిజానికి 5ను బ్యాడ్ సెంటిమెంట్‌గా పరిగణించరు. అయినా కానీ ఆయన ఇబ్బంది పడటానికి కారణం.. తన లాంటి పేరు ఉన్న మరో అభ్యర్ధి కూడా చేవెళ్ళ ఎంపీగా పోటీ చేస్తున్నారు. దీంతో కొండా తెగ మదనపడుతున్నారు. ఈయన ఇటీవల ప్రచారానికి వెళ్లిన సందర్భంలో.. డమ్మీ ఈవీఎం మెషీన్ చూపించగానే.. అందులో 5 నెంబర్‌లో కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు ఉంది. అక్కడే బటన్ నొక్కుతాం అని కొందరు అంటున్నారట.

రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్‎కు కలిసొచ్చేనా ? గెలుపుపై సీఎం రేవంత్ వ్యూహం ఇదేనా..

భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో లాభం చేకూర్చుతుందా? ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందా? ఈ అంశం కాంగ్రెస్ పార్టీకి కలిసొస్తుందా? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఈ ఎన్నికల్లో 400 పైగా సీట్లు సాధించాలని బీజేపీ లక్ష్యం విధించుకోవడం వెనుక ఒక కుట్ర దాగి ఉందని, రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఇటీవల ముఖ్యమంత్రి సంచలన ఆరోపణ చేశారు.

Watch Video: దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని మోదీ విమర్శలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్

ప్రధానమంత్రి అండ్‌ 5 ఎడిటర్స్‌ టీవీ9 ప్రోగ్రాంలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు చేశారు. అవినీతి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ వస్తాయన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనను బడే భాయ్ అంటున్నారన్న మోదీ.. పెద్దల నుంచి మంచి విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ సర్కారు తెలంగాణలో డబులార్ ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆరోపించారు.

Watch Video: పెద్ద “గాడిద గుడ్డు”.. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార వీడియో వైరల్..

గాడిద గుడ్డు.. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై పైచేయి సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ దీన్నే ప్రచారాస్త్రంగా మలుచుకుంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్‌కు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణల నేపథ్యంలో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. తెలంగాణ పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ గురువారం మే 2న ఒక ఎన్నికల ప్రచార వీడియో విడుదల చేసింది.

  • Srikar T
  • Updated on: May 3, 2024
  • 4:48 pm

సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

తెలంగాణ గడ్డ మీద సవాళ్ల రాజకీయం నడుస్తోంది. సీఎం రేవంత్‌కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ చేసిన అభివృద్ధిపై సీఎం రేవంత్‌కు మాట్లాడే దమ్ము, ధైర్యం ఉందా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ చేసిన అభివృద్దిపై చర్చకు తాను సిద్ధం అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న దశాబ్దం పాటు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఏ విధమైన పథకాలు తీసుకొచ్చారు, తెలంగాణకు ఏమిచ్చారో చెప్పాలన్నారు.

  • Srikar T
  • Updated on: May 3, 2024
  • 3:22 pm

అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో తెలంగాణ వర్సెస్ ఢిల్లీ పోలీస్..

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో అంశం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో ఢిల్లీ పోలీసులు స్పీడ్ పెంచారు. ఢిల్లీ పోలీసుల యాక్షన్‌కు ముందుగానే హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగిపోయారు. తెలంగాణ బీజేపీ నేత ప్రేమేందర్ ఫిర్యాదుపై 469, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జి మన్నె సతీశ్, సోషల్ మీడియా టీంలోని సభ్యులు అస్మా, తస్లీమా, గీత, శివలను అరెస్ట్ చేసి సెంట్రల్ క్రైం స్టేషన్‌కు తరలించారు.

Telangana: లోక్‌సభ ఎన్నికల వేళ.. కమలదళం ఎంపీపై కాంగ్రెస్ అగ్రజుడి ప్రేమాభిమానాల.. మతలబేంటో..?

ఆయన ప్రతిపక్ష పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ.. ఆదివాసీ ఉద్యమ నేత.. నిన్నమొన్నటి వరకు ఉద్యమాల్లో దూకుడుగా వ్యవహరించి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, గెలిచి నిలిచిన నాయకుడు. కానీ ఐదేళ్ల కాలంలోనే ఆ చరిష్మా ఒక్కసారిగా మాయమై చివరికి సిట్టింగ్ సీటును కూడా దక్కించుకోలేని పరిస్థితి ఆయనకి ఎదురైంది.

Andhra Pradesh: అర్హత ఉన్నప్పటికీ హోం ఓటింగ్ వేసేందుకు ముందుకు రాని ఓట‌ర్లు.. కారణం అదేనా..!

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నిక‌ల‌కు గ‌డువు ముంచుకొస్తుంది. ఎన్నిక‌ల షెడ్యూల్ ప్రకారం ఈసీ అధికారులు ఒక్కొక్కటిగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు...ఇప్పటికే తుది ఓట‌ర్ల జాబితా విడుద‌ల చేయ‌డంతో పాటు నామినేష‌న్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఇక పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించారు.

  • MP Rao
  • Updated on: May 3, 2024
  • 1:55 pm

Congress Manifesto: హైదరాబాద్‌కు జాతీయ సంస్థలు, పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా.. కాంగ్రెస్ మేనిఫెస్టో ఇదే!

కేంద్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 6 హామీల మంత్రం ఫలించడంతో ఈసారి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన హామీలపై రాజకీయ వర్గాలు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

PM Modi: భయపడ్డారు.. పారిపోయారు.. రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ, టీఎంసీతోపాటు కాంగ్రెస్ నేత రాహుల్ టార్గెట్ చేస్తూ ఘాటుగా విమర్శించారు. బెంగాల్‌లో హిందువులు సురక్షితంగా లేరని ప్రధాని మోదీ అన్నారు.

PM Modi: ప్రత్యేక శైలితో ప్రజా రాజకీయ నాయకుల హృదయాలను గెలుచుకుంటున్న నరేంద్ర మోదీ

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి సంబంధించి బీజేపీ నేతలు పలు వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇప్పుడు మాజీ బిజూ జనతా దళ్ నాయకుడు మరియు ఎంపీ భర్తృహరి మహతాబ్ ఒక వీడియోను పంచుకున్నారు. చాలా మంది ప్రతిపక్ష నేతలు కూడా ప్రధాని మోదీని సంరక్షకుడిగా వ్యవహరిస్తున్నారని ఇందులో ఆయన చెప్పారు.

Amit Shah Fake Video: అమిత్ షా నకిలీ వీడియో సృష్టి తెలంగాణలోనే.. తేల్చిన ఢిల్లీ పోలీసులు!

రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేయని వ్యాఖ్యలను చేసినట్టుగా ఎడిట్ చేసి, సోషల్ మీడియాలో వైరల్ చేసిన వీడియో సృష్టించింది తెలంగాణలోనేనని తేలింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ (IFSO Unit) ఐపీ అడ్రస్ ఆధారంగా వీడియో సృష్టించిన ప్రదేశం తెలంగాణలోనే ఉందని గుర్తించింది.

CM YS Jagan: వైసీపీ త్రిశూల వ్యూహం.. గెలుపు కోసం అభ్యర్థుల ప్రచారం.. వాళ్ల కోసం జగన్ ప్రచారం

రెండోసారి అధికారమే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ దూకుడుగా వెళ్తోంది. అభ్యర్థులు తమ గెలుపు కోసం వాళ్లు కష్టపడుతున్నారు. వాళ్లను గెలిపించడం కోసం అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టపడుతున్నారు. జగన్‌ కోసం తాము సైతం అంటూ కొత్తగా వీళ్లు రంగంలోకి దిగారు.

Latest Articles
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు